తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముద్దగౌని రామ్మోహన్ గౌడ్
తిరుమల:
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శుక్రవారం సాయంత్రం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. పిసిసి మాజీ కార్యదర్శి, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.వారిని దర్శనానంతరం ఆలయ అధికారులు వేదపండితులతో ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. రామ్మోహన్ గౌడ్ గారితో పాటు గ్రేటర్ హైదరాబాద్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ సంరెడ్డి భుజంగ రెడ్డి, శ్రీ కోట సుదర్శన్ రెడ్డి, శ్రీ పగిల్ల సుధాకర్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామివారి కృపతో అందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. సాయంత్రం వేళ ఆలయానికి చేరుకున్న నాయకులకు స్థానిక నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
