హయత్ నగర్ అభివృద్ధికి మహర్దశ: రూ. 83 లక్షలతో రహదారుల నిర్మాణం!
- డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.. నాణ్యతలో రాజీ పడొద్దు
- పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
హయత్ నగర్:
హయత్ నగర్ డివిజన్ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. బుధవారం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో సుమారు 83 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శివశక్తి నగర్, సూర్య తేజ కాలనీ, విద్యా నగర్ కాలనీలలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పనులను ప్రారంభించారు.
శివశక్తి నగర్‌లో రూ. 16.50 లక్షల పనులు
సూర్య తేజ కాలనీలో రూ. 23.50 లక్షలతో శ్రీకారం
విద్యా నగర్‌లో రూ. 43 లక్షల భారీ వ్యయంతో..
విద్యా నగర్ కాలనీలో అత్యంత ప్రాధాన్యత కింద రూ. 43 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రతి వీధి అభివృద్ధి చెందితేనే డివిజన్ మొత్తం ఆదర్శంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు.
గర్వంగా ఉందన్న కాలనీ వాసులు:
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు కార్పొరేటర్ చొరవ తీసుకోవడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, నాయకులు సంఘీ అశోక్, గంగాని శ్రీనివాస్ మరియు ఆయా కాలనీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు
