సిద్ధి వినాయక హిల్స్‌లో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ ముద్దుల వచ్చిరెడ్డి..

సిద్ధి వినాయక హిల్స్‌లో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ ముద్దుల వచ్చిరెడ్డి..

బీఎన్‌ రెడ్డి నగర్‌:

డివిజన్ పరిధిలోని శ్రీ సిద్ధి వినాయక హిల్స్ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 19 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి బుధవారం ఘనంగా శంకుస్థాపన చేశారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీవాసుల చిరకాల కోరిక మేరకు నిధులు మంజూరు చేయించామని, త్వరలోనే పనులు ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కాలనీల్లోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడబోమని ఆయన పేర్కొన్నారు.
​పాల్గొన్న ముఖ్యులు:
ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
​కాలనీ కమిటీ: అధ్యక్షుడు సుబ్బారావు యాదవ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, గీతారాణి, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి, కోశాధికారి సుధాకర్ రెడ్డి.
​సలహాదారులు & సభ్యులు: కైలాసవతి, భాస్కర్, బ్రహ్మయ్య, సంపత్ కుమార్, వెంకటేశ్వరరావు, శ్రీకాంత్, భారతి తదితరులు.
​పార్టీ ప్రతినిధులు: డివిజన్ ప్రధాన కార్యదర్శి గంగం ప్రేమ్ నాథ్, విష్ణువర్ధన్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్ పాల్గొన్నారు.

About The Author