రోడ్ల నిర్మాణం, భవన సుందరీకరణ అభినందనీయం.
కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డికి 'ఆత్మీయ సత్కారం'
ఎల్బీనగర్:
ఎన్జీవోస్ కాలనీ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డిని 'రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ, సంస్కృతిక సంఘము' ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. శుక్రవారం కాలనీలోని సంఘం భవనంలో ఏర్పాటు చేసిన 'ఆత్మీయ సత్కారం' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. కాలనీలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనానికి నూతన రంగులు వేయించి సుందరీకరించడంతో పాటు, కాలనీలో నూతన రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కార్పొరేటర్ చూపుతున్న చొరవ అభినందనీయమని వారు కొనియాడారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పంపన వెంకటేశ్వర్లు, సోమయాజులు, పి.వి.వి. సత్యనారాయణ, శ్యాం ప్రసాద్, విశ్వనాధ్, బసవయ్య, కూర్మారావు, వర్ధిని, ఓం ప్రకాష్, బాల్ రెడ్డి, జడ్జ్ కృష్ణమూర్తి, ఆంజనేయులు, సిహెచ్.వి.ఆర్.కె. మూర్తి పాల్గొన్నారు. అలాగే డివిజన్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, సుధీర్ కుమార్, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
