చంపాపేట కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి మృతికి మల్‌రెడ్డి రాంరెడ్డి నివాళులు..

చంపాపేట కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి మృతికి మల్‌రెడ్డి రాంరెడ్డి నివాళులు..

ఎల్బీనగర్:

చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మధుసూదన్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
​ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. మధుసూదన్ రెడ్డి మరణం అత్యంత విషాదకరమని, ఇది ప్రజాజీవితానికి తీరని లోటని పేర్కొన్నారు. కార్పొరేటర్‌గా చంపాపేట డివిజన్ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు.
​కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మధుసూదన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

About The Author