కొరడా ఝుళిపించిన హైడ్రా!

  • ​జూబ్లీహిల్స్ నీరూస్ షాపు సీజ్
  • ​అగ్నిగుండంలా నాంపల్లి ఫర్నీచర్ షోరూమ్.. తాళం వేసిన అధికారులు..
  • ​షాపులా? చావు డెన్నాాలా? కమిషనర్ రంగనాథ్ ఫైర్
  • ​ప్రాణాలతో చెలగాటమాడితే ఖబర్దార్!

కొరడా ఝుళిపించిన హైడ్రా!

​హైదరాబాద్:

నిబంధనలు గాలికి.. జనం ప్రాణాలు బలికి అన్నట్టుగా తయారైంది సిటీలోని బడా వ్యాపారాల తీరు. అగ్నిప్రమాదాలు జరుగుతున్నా, అమాయకులు చనిపోతున్నా అడ్డగోలు దందాలు ఆపని షోరూమ్‌లపై 'హైడ్రా' (HYDRAA) విరుచుకుపడింది. గురువారం జూబ్లీహిల్స్, నాంపల్లి ఏరియాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. ఫైర్ సేఫ్టీని తుంగలో తొక్కడమే కాకుండా, అనుమతి లేని అక్రమ నిర్మాణాలతో ప్రమాదకరంగా మారిన నీరూస్ షోరూమ్‌తో పాటు ఓ భారీ ఫర్నీచర్ దుకాణాన్ని సీజ్ చేశారు.
​నీరూస్‌లో అన్నీ అక్రమాలే..
​జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని నీరూస్ వస్త్ర షోరూమ్‌లో అధికారులు తనిఖీ చేస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
​రూఫ్ టాప్ గోదాము: భవనం పైన పర్మిషన్ లేకుండా రూఫ్ షెడ్డు వేసి, వందల టన్నుల వస్త్రాలను నింపేశారు.
​చిమ్మచీకటి సెల్లార్లు: మూడు సెల్లార్లలో గాలి కూడా ఆడని రీతిలో స్టాక్ కుక్కేశారు. అమ్మకాలు చేసేది రెండు ఫ్లోర్లే అయినా, పైన మరో మూడు ఫ్లోర్లను డేంజర్ గోదాములుగా మార్చేశారు.
​పనిచేయని ఆర్పే యంత్రాలు: కనీసం ఫైర్ ఎన్వోసీ లేదు సరికదా.. మంటలు చెలరేగితే ఆర్పే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు కూడా పనిచేయట్లేదు. దీంతో కనెక్షన్ కట్ చేసి అధికారులు షాపుకు సీల్ వేశారు.WhatsApp Image 2026-01-29 at 18.22.14

​ఐదుగురు చనిపోయినా బుద్ధి రాలే!

​నాంపల్లిలో మొన్ననే ఐదుగురు ప్రాణాలు కోల్పోయినా వ్యాపారుల తీరు మారలేదు. స్టేషన్ రోడ్డులోని 'రహీమ్, మన్నన్ ఎస్టేట్స్ స్టాండర్డ్ ఫర్నీచర్' షాపును తనిఖీ చేసిన కమిషనర్ అక్కడి పరిస్థితి చూసి షాక్ అయ్యారు.
​మెట్ల దారిలోనూ సామాన్లే: ఆరు అంతస్తుల భవనంలో కనీసం నడవడానికి చోటు లేకుండా ఫర్నీచర్‌ను నింపేశారు.
​ఎమర్జెన్సీ దారి క్లోజ్: అగ్నిప్రమాదం జరిగితే బయటకు వెళ్లే మెట్ల మార్గాన్ని కూడా వదలకుండా స్టాక్ పేర్చారు. ఒక్క ఫైర్ సేఫ్టీ పరికరం కూడా లేకపోవడంతో వెంటనే షాపును సీజ్ చేయించారు.
​మీరు చూస్తున్నారా? అయితే ఫిర్యాదు చేయండి!
​మీ ఏరియాలో అక్రమంగా గోదాములు పెట్టినా, సెల్లార్లను వ్యాపారాలకు వాడుతూ ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నా భయపడకుండా ఫిర్యాదు చేయండి.

​హైడ్రా హెల్ప్ లైన్: 90001 13667
​నేరుగా కమిషనర్‌కు: 72079 23085 (వాట్సాప్ ద్వారా ఫోటోలు, వీడియోలు పంపవచ్చు)
​సోషల్ మీడియా: X (ట్విట్టర్) - @Commissioner_HYDRAA
​"వ్యాపారం అంటే కేవలం లాభం కాదు.. జనం భద్రత కూడా ఉండాలి. షాపులను గోదాములుగా మార్చేసి ప్రజల ప్రాణాలను రిస్కులో పెడితే వెనకాముందు చూడకుండా కఠిన చర్యలు తీసుకుంటాం."
— ఏవీ రంగనాథ్, కమిషనర్, హైడ్రా

​ అక్రమ కట్టడాలపైనే కాదు.. అగ్నిప్రమాదాలకు కారణమయ్యే అడ్డగోలు నిల్వలపై కూడా హైడ్రా పంజా విసిరింది.

About The Author