స్కూటీపై నుంచి పడ్డ వృద్ధుడు.. అక్కున చేర్చుకున్న ట్రాఫిక్ పోలీసులు!

  • ​స్వయంగా ఫస్ట్ ఎయిడ్ చేసిన ఏసీపీ శంకర్ రాజు
  • ​సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలింపు

స్కూటీపై నుంచి పడ్డ వృద్ధుడు.. అక్కున చేర్చుకున్న ట్రాఫిక్ పోలీసులు!

​కార్ఖానా, హైదరాబాద్:

రోడ్డు ప్రమాదంలో గాయపడి సాయం కోసం ఎదురుచూస్తున్న ఓ వృద్ధుడికి ట్రాఫిక్ పోలీసులు అండగా నిలిచారు. ఖాకీ డ్రెస్సులో ఉన్నా కడుపులో ఈరము (కరుణ) ఉందని చాటుకున్నారు. స్కూటీ స్కిడ్ అయి పడిపోయిన పెద్దాయనకు ఏసీపీ స్వయంగా ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.

​అసలేం జరిగిందంటే..
వాసవి నగర్‌కు చెందిన ప్రదీప్ కుమార్ (65) గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తన స్కూటీపై బయలుదేరిండు. త్రిముల్గెరి ట్రాఫిక్ పీఎస్ పరిధిలోని కార్ఖానా కేఎఫ్‌సీ ముందుకు రాగానే బైక్ ఒక్కసారిగా స్కిడ్ అయ్యింది. దీంతో ఆయన రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.

​ఏసీపీ సమయస్ఫూర్తి..

అదే టైంలో అటుగా వెళ్తున్న బేగంపేట్ ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు, మొబైల్-4 సిబ్బందితో కలిసి వెంటనే ఆగారు. రక్తంతో ఇబ్బంది పడుతున్న ప్రదీప్ కుమార్‌ను చూసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరికి వెళ్లారు. వాహనంలో ఉన్న మెడికల్ కిట్ తీసి గాయాలకు కట్లు కట్టారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి, దగ్గరుండి చిక్కడపల్లి శ్రీకర్ ఆసుపత్రికి పంపించారు. 

పోలీసుల సమయస్ఫూర్తిని చూసి జనం 'శభాష్' అంటున్నారు. ముసలివాళ్లు బండ్లు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, హెల్మెట్ పెట్టుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.

About The Author