సిటీ నడిబొడ్డున ‘హెల్త్ సెంటర్లు’ వెంటనే ఏర్పాటు చేయాలి.!
- ఇండస్ట్రీల ప్లేస్‌లో విద్యా, వైద్య హబ్‌లు ఏర్పాటు చేయాలి కాలుష్య కోరల్లో నగరం..
- సర్కారు సాహసోపేత నిర్ణయం తీసుకోవాలి కార్మికుల పిల్లలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి: అల్లంపల్లి రామకోటి డిమాండ్
హైదరాబాద్:
హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా మార్చడంతో పాటు, పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య, వైద్యాన్ని చేరువ చేసేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన అడుగులు వేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి డిమాండ్ చేశారు. నగరం నడిబొడ్డున ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను ఖాళీ చేయించి, ఆ స్థలాలను ప్రజా సంక్షేమ కేంద్రాలుగా (విద్యా-వైద్య హబ్‌లు) మార్చాలని ఆయన కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
పొల్యూషన్ హబ్‌లుగా మారిన నివాస ప్రాంతాలు ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా, ఆటోనగర్, మలక్‌పేట గంజి వంటి రద్దీ ప్రాంతాల్లో పరిశ్రమల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రామకోటి ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్తపేట స్ఫూర్తితోనే ముందుకు..
గతంలో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌ను తరలించి, అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తీరును ఆయన ఉదహరించారు. అది ఒక చారిత్రాత్మక పరిణామమని కొనియాడారు. అదే తరహాలో ఉప్పల్, ఆటోనగర్, మలక్‌పేట స్థలాలను కూడా కేవలం విద్యా, వైద్య అవసరాలకే కేటాయించాలని, తద్వారా తెలంగాణ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకాలని సూచించారు.
కార్మికుల భద్రతే మా ప్రాధాన్యత:
పరిశ్రమల స్థానంలో నిర్మించే విద్యా, వైద్య సంస్థల్లో సదరు కార్మికుల పిల్లలకే మొదటి ప్రాధాన్యత (First Priority) కల్పించాలి. కార్మికులకు ఉచిత సేవలు అందేలా ప్రభుత్వం పక్కా ప్లాన్ చేయాలి.
విద్యా-వైద్య హబ్‌ల ఏర్పాటుపై త్వరలోనే ముఖ్యమంత్రితో పాటు సంబంధిత మంత్రులకు వినతి పత్రం అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
About The Author
04 Feb 2026
