బడంగ్‌పేట్ సర్కిల్‌లో ముమ్మరంగా ‘స్పెషల్ శానిటేషన్ డ్రైవ్’

  • ​క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన డిప్యూటీ కమిషనర్ వి. సరస్వతి
  • ​జీవీపీల తొలగింపు.. రంగవల్లికలతో ముస్తాబు

బడంగ్‌పేట్ సర్కిల్‌లో ముమ్మరంగా ‘స్పెషల్ శానిటేషన్ డ్రైవ్’

బడంగ్‌పేట్:


 బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్-16 పరిధిలో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం డిప్యూటీ కమిషనర్ శ్రీమతి వి. సరస్వతి ఆధ్వర్యంలో అన్ని డివిజన్లలో ‘స్పెషల్ శానిటేషన్ డ్రైవ్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, పారిశుధ్య పనులను పర్యవేక్షించడమే కాకుండా సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.

​డివిజన్ల వారీగా పారిశుధ్య పనులు:
​నగరంలోని ప్రధాన కూడళ్లు, అంతర్గత వీధుల్లో ఉన్న గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ (GVP)లను పూర్తిగా శుభ్రం చేసి, అక్కడ మళ్లీ చెత్త వేయకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

​డివిజన్ 57: శివాజీ చౌక్, కళావతి నగర్ కమాన్, అల్మాస్‌గూడ, గుర్రంగూడ సాగర్ రోడ్, నాదర్గుల్ గొంది కాలనీల్లో చెత్త కుప్పలను తొలగించారు.

​డివిజన్ 58: ప్రశాంతి హిల్స్, బడంగ్‌పేట్ కమాన్, హుడా కమ్యూనిటీ హాల్, రైతు బజార్ ప్రాంతాల్లో శుభ్రం చేసి, ఆకర్షణీయమైన ముగ్గులు వేశారు.

​డివిజన్ 59: గాయత్రీ నగర్, అంబేద్కర్ నగర్, జిల్లేలగూడ కల్లు కాంపౌండ్, RCI రోడ్, DNR కాలనీలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.

​డివిజన్ 60: మీర్‌పేట్ మెయిన్ రోడ్, పెట్రోల్ పంప్ ఏరియా, మీర్‌పేట్ ఎక్స్ రోడ్స్, SLNS కాలనీల్లో జి.వి.పిలను తొలగించి ముగ్గులు వేశారు.

​డివిజన్ 61: కాకతీయ స్కూల్, అంగన్‌వాడీ కేంద్రం, అంబేద్కర్ విగ్రహం, రామచంద్ర కాలనీ, రాక్ గార్డెన్ ఆపోజిట్, కుర్మల్‌గూడ విలేజ్ పరిధిలో రంగోలి ముగ్గులతో పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు

​డివిజన్ 62: బాలాపూర్ అంబేద్కర్ విగ్రహం, సాయి నగర్ కాలనీ, మల్లాపూర్ వీక్లీ మార్కెట్ ఏరియాల్లో ప్రత్యేక క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు.


​ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు డిప్యూటీ కమిషనర్ సరస్వతితో పాటు డీవైఈఈ (SWM) ఎం. అభినయ్ కుమార్, ఏఈ గంగా ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ వి. యాదగిరి, జూనియర్ అసిస్టెంట్ ఎం. నర్సింహ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రాము, వార్డు అధికారులు, జవాన్లు మరియు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు. 

నగర పరిశుభ్రత విషయంలో ప్రజలు సహకరించాలని, చెత్తను రోడ్లపై వేయకుండా కేటాయించిన వాహనాలకే అందించాలని అధికారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

About The Author