బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ ముద్దు.లచిరెడ్డి..
వనస్థలిపురం:
దేశ వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో పలుచోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, డివిజన్‌లోని సుమారు 14 ప్రాంతాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
అభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్యం:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శులు గంగం ప్రేమ్ నాథ్, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు పవన్ రెడ్డి, OBC మోర్చా అధ్యక్షుడు మహేష్ గౌడ్, సీనియర్ నాయకులు ప్రభాకర్ యాదవ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే యువజన విభాగం నుంచి BJYM అధ్యక్షుడు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి అఖిల్ గౌడ్, ఎస్సీ మోర్చా నుంచి దుర్గా ప్రసాద్, ఠాగూర్, మనోజ్ కుమార్, సాయిరాంలతో పాటు ఆయా కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
