కార్పొరేటర్‌ వంగా మధుసూదన్‌రెడ్డికి డిప్యూటీ మేయర్‌ నివాళి

కార్పొరేటర్‌ వంగా మధుసూదన్‌రెడ్డికి డిప్యూటీ మేయర్‌ నివాళి

​కర్మన్‌ఘాట్‌:

చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి అకాల మరణం పట్ల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం కర్మన్‌ఘాట్‌లోని మధుసూదన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆమె, ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

​ప్రజాసేవలో చిరస్మరణీయులు..
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. మధుసూదన్ రెడ్డి నిరంతరం ప్రజాసేవకే అంకితమయ్యారని కొనియాడారు. ప్రజాప్రతినిధిగా తన డివిజన్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన అకాల వియోగం అటు ప్రజలకు, ఇటు పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. మధుసూదన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయనలోని సేవాభావం, నాయకత్వ లక్షణాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

About The Author