సాగర్‌ రింగ్‌ రోడ్డు ఫ్లైఓవర్‌కు ‘వంగ మధుసూదన్‌రెడ్డి’ పేరు పెట్టాలి.

​జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన కార్పొరేటర్‌ రాజశేఖర్ రెడ్డి.

సాగర్‌ రింగ్‌ రోడ్డు ఫ్లైఓవర్‌కు ‘వంగ మధుసూదన్‌రెడ్డి’ పేరు పెట్టాలి.

​హైదరాబాద్‌: 

సాగర్‌ రింగ్‌ రోడ్డులోని ఫ్లైఓవర్‌కు ఇటీవల అకాల మరణం చెందిన చంపాపేట డివిజన్‌ కార్పొరేటర్ దివంగత వంగ మధుసూదన్‌ రెడ్డి పేరు పెట్టాలని జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌, లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్‌ రెడ్డి కోరారు. బుధవారం ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్‌కు మధుసూదన్ రెడ్డి పేరు నామకరణం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.WhatsApp Image 2026-01-28 at 18.42.45

​ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం:
గత ఐదేళ్లుగా కౌన్సిల్ సమావేశాల్లో మధుసూదన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, నిధుల మంజూరు కోసం నిరంతరం గళం ఎత్తారని రాజశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన ఆయన సేవలకు గుర్తింపుగా ఫ్లైఓవర్‌కు ఆయన పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

​మేయర్‌ను కలిసిన నాయకులు:
ఈ ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీ ముందు ఉంచి ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కూడా కోరినట్లు రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే సాగర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్‌కు వంగ మధుసూదన్ రెడ్డి పేరు పెట్టేలా తన వంతు కృషి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

About The Author