వనదేవతల ఒడిలో ప్లాస్టిక్ రక్కసి వద్దు!

  • 22 భాషల్లో మేడారం చాటింపు.. కదిలిన ‘ప్రపంచ పర్యావరణ సంస్థ’
  • ​మంత్రులు సీతక్క, పొన్నం చేతుల మీదుగా జ్యూట్ బ్యాగుల పంపిణీ,
  • ​అమ్మవార్ల సాక్షిగా పర్యావరణ పరిరక్షణ ‘మహా యజ్ఞం’

వనదేవతల ఒడిలో ప్లాస్టిక్ రక్కసి వద్దు!

​మేడారం:

కోట్లాది మంది కొలిచే కంచుకమ్మల కాంతారంలో ప్లాస్టిక్ భూతాన్ని పారదోలేందుకు ‘ప్రపంచ పర్యావరణ సంస్థ’ శంఖారావం పూరించింది. వనదేవతల చెంతకు వచ్చే భక్తులకు పర్యావరణ స్పృహ కలిగించేలా వినూత్న రీతిలో అవగాహన కల్పించింది. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అర్థమయ్యేలా రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో "మేడారాన్ని కాపాడుకుందాం" అని రాసి ఉన్న భారీ క్లాత్ బ్యానర్‌తో నిర్వహించిన ర్యాలీ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), పొన్నం ప్రభాకర్ పాల్గొని పర్యావరణ కార్యకర్తలను అభినందించారు.

అడవిని కాపాడుకుంటేనే మనకు మనుగడ: మంత్రి సీతక్క.

​మంత్రి సీతక్క మాట్లాడుతూ పర్యావరణ సంస్థ చేస్తున్న 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని కొనియాడారు. "మన సంస్కృతికి మూలం ప్రకృతి. అడవి తల్లి సాక్షిగా ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చడమే మనం అమ్మవార్లకు ఇచ్చే అసలైన మొక్కు. 22 భాషల్లో సందేశం ఇవ్వడం ద్వారా మేడారం విశిష్టతను దేశవ్యాప్తం చేస్తున్నారు" అని మెచ్చుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ భక్తులకు జ్యూట్ బ్యాగులు పంపిణీ చేస్తూ, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లను త్యజించాలని కోరారు.WhatsApp Image 2026-01-30 at 09.58.33

​మూగజీవాల ప్రాణాలు తీస్తున్న ప్లాస్టిక్: 

జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర
​జాతర ముగిశాక మిగిలిపోయే ప్లాస్టిక్ వ్యర్థాలు అడవిలోని జంతువులకు శాపంగా మారుతున్నాయని సంస్థ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ తిని అడవిలోని మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని, భూసారం దెబ్బతింటోందని భక్తులకు వివరించారు.

​మల్టీ లింగ్యువల్ బ్యానర్:

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వచ్చే భక్తులకు అర్థమయ్యేలా 22 భాషల్లో పర్యావరణ సందేశం.
​జ్యూట్ బ్యాగుల పంపిణీ: ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా మంత్రుల చేతుల మీదుగా బట్ట సంచుల పంపిణీ.

​యూత్ ఫోర్స్: సంస్థ వాలంటీర్లు ఆర్టీసీ బస్టాండ్లు, గద్దెల వద్ద "సేవ్ మేడారం - క్లీన్ మేడారం" అంటూ హోరెత్తించారు.
​ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ భద్ర, జాతీయ కార్యదర్శి సాగర్, నిఖిల్ సాయి, రామకృష్ణ, యువరాజ్, సుమెర్ తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-01-30 at 09.58.33 (1)

About The Author