మంత్రి పొంగులేటి పర్యటనను జయప్రదం చేయండి.
కాంగ్రెస్ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్
మణుగూరు :
పినపాక మండలంలో నేడు రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని మణుగూరు మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్ గురువారం ప్రకటనలో కోరారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మణుగూరు మండలంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కుటుంబ సమేతంగా రావాలని ఉపసర్పంచ్,వార్డ్ మెంబెర్ లు మధ్యాహ్నం 3.00 గం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల జీవిఆర్ ఫంక్షన్ హాల్ లో సన్మాన అభినందన ఉంటుందని తెలిపారు. అనంతరం ఈ బయ్యారం జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహిస్తున్న అండర్ 17 జాతీయ బాలుర కబడ్డీ పోటీలకు మంత్రి హాజరవుతారని తెలియజేశారు. మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ అనుబంధసంఘ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు సకాలంలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.
