పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి..
టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ
హయత్ నగర్:
ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. అనారోగ్యంతో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను శుక్రవారం హయత్ నగర్ లోని తన కార్యాలయంలో ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం సామాన్యులకు భారంగా మారుతున్న తరుణంలో, ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ఎంతో ఊరటనిస్తుందన్నారు. బాధితులు తమ సమస్యను వివరించగానే సానుకూలంగా స్పందించి నిధులు మంజూరయ్యేలా కృషి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు.
సహాయం పొందిన వారు వీరే..
మొత్తం 15 మంది బాధితులకు ఈ ఆర్థిక సాయం అందింది. రాజేందర్ గౌడ్, నక్క సుధాకర్ గౌడ్, కార్తీక్ యాదవ్, అనమోని నిర్మల, ధనవత్ కౌసల్యలకు రూ.60,000 చొప్పున.. యశోదకు రూ.51,000, కుళవిందర్ కౌర్ సింగ్‌కు రూ.47,500, కిషోర్ రెడ్డికి రూ.46,500, గ్యార లతకు రూ.42,500 చొప్పున చెక్కులను అందజేశారు. అలాగే సరిత, పడిగేశ్వర్ రావు, అనిల్ కుమార్, శ్రీనివాస్ చారి, మహ్మద్ ఇస్మాయిల్, పెద్ద యాదమ్మలకు కూడా మంజూరైన నిధులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, నాయకులు శ్రీపాల్ రెడ్డి, రవీందర్ గౌడ్, నర్సింహా యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అశోక్ గౌడ్, గణేష్ నాయక్, బాబా యాదవ్, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
