బాలల సంరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

భద్రాద్రి జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 04 (భారతశక్తి): బాలల సంరక్షణ అందరి బాధ్యత అని అందుకే బాల రక్షా భవన్ ను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాల రక్ష భవన్ ను జిల్లా కలెక్టర్ సందర్శించి అన్ని గదులను పరిశీలించారు. బాలల రక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. బాల రక్షా భవన్ లో కావలసిన వస్తువులు, కార్యాలయం కు అవసరమైన కంప్యూటర్లు, ఇతర సామాగ్రి ఏర్పాటుకు నివేదిక అందించాలని మహిళా,శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి స్వర్ణలత ను ఆదేశించారు. బాల రక్షాభవన్ లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాలల సంక్షేమ సమితి, బాలల న్యాయమండలి, ప్రత్యేక బాలల పోలీసు విభాగం, జాతీయ బాల కార్మిక నిర్మూలనా పథకం, జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్, చైల్డ్ లైన్ అన్నీ కలిపి ఒకే చోట అందుబాటులో ఉంటాయన్నారు. బాలల రక్షణకు సంబంధించిన అన్ని అంశాలు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ భారతీయ రాణి, డిసిడివో హరికుమారి, సిడబ్ల్యుసి సభ్యులు సుమిత్రాదేవి, షాదిక్ పాషా, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సందీప్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author