శ్రీ జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ అభిలాష అభినవ్.

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 03: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా కొనగుతున్నాయి.సోమవారం ఉదయం జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజల నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వసంత పంచమి వేడుకల సందర్బంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎస్పి జానకి షర్మిళ, అదనపు ఎస్పీ అవినాశ్ కుమార్,నిర్మల్ ఏఎస్పి రాజేష్ మీనా వసంత పంచమి వేడుకల ప్రత్యేకాధికారి, భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, బాసర తాసిల్దార్ ఆలయ ఇంచార్జి ఈవో సుధాకర్, ఇతర అధికారులు వేడుకలను పర్యవేక్షిస్తున్నారు.

శ్రీ జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ అభిలాష అభినవ్.

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 03: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా కొనగుతున్నాయి.సోమవారం ఉదయం జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజల నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వసంత పంచమి వేడుకల సందర్బంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎస్పి జానకి షర్మిళ, అదనపు ఎస్పీ అవినాశ్ కుమార్,నిర్మల్ ఏఎస్పి రాజేష్ మీనా వసంత పంచమి వేడుకల ప్రత్యేకాధికారి, భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, బాసర తాసిల్దార్ ఆలయ ఇంచార్జి ఈవో సుధాకర్, ఇతర అధికారులు వేడుకలను పర్యవేక్షిస్తున్నారు.

About The Author