డీసీ వంశీకృష్ణకు వినతిపత్రం అందించిన రాక్ టౌన్ వెల్ఫేర్ సోసైటీ కార్యవర్గ సభ్యులు

WhatsApp Image 2025-12-02 at 6.36.06 PM

ఎల్బీనగర్ : 

Read More గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

హయత్ నగర్ సర్కిల్ 3, డిప్యూటీ కమీషనర్ వంశీకృష్ణను సరూర్ నగర్ జిహెచ్ఎంసి కార్యాలయంలో రాక్ టౌన్ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ మణిపాల్ రెడ్డి కలిసి కాలనీలో ప్రతిరోజు రోడ్లు ఊడిచిన చెత్త కాలనీలో 3 నుండి 4 పాయింట్స్ లలో డంప్ చేసి అక్కడ నుండి డంపింగ్ యార్డ్ కి తరలించే విషయంలో ప్రతి రోజు ఒక్క ట్రిప్ టిప్పర్ మాత్రమే జిహెచ్ఎంసి నుండి రావడంతో కాలనీలో డంప్ చేసిన చెత్త క్లీన్ అవ్వడం లేదు.రోజు రోజుకు చెత్త పేరుకపోతుంది. కాబట్టి అదనంగా ఇంకోక వెహికిల్ ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. అలాగే అవకాశం ఉంటే సొసైటీ వారు ప్రైవేట్ వెహికిల్ ఏర్పాటు చేసుకొని చెత్త తీసుకోని వెళ్తే డంపింగ్ యార్డ్ లో డంప్ చేయడానికి కూడా పర్మిషన్ ఇప్పించమని కోరడం జరిగింది. దానికి డీసీ వంశీకృష్ణ సానుకూలంగా స్పందించి తప్పకుండా అదనంగా ఇంకొక వెహికిల్ వారానికి 1 లేదా 2 సార్లు ఏర్పాటు చేస్తాన్నారు. అలాగే ప్రైవేట్ వెహికిల్ పర్మిషన్ కోసం కూడా ట్రై చేస్తాన్నారు. 

Read More అంధుల పాఠశాల విద్యార్థినితో కలిసి పాడిన జిల్లా కలెక్టర్

About The Author