మోధీ విజన్ కు ఢిల్లీ ఫలితాలే నిదర్శనం: మాజీ మేయర్ సునీల్ రావు
కరీంనగర్, ఫిబ్రవరి 8(భారత శక్తి): దేశ ప్రధాని మోది విజన్ తో రాబోయో రోజుల్లో భారతదేశంలోనీ అన్ని రాష్ట్రాల్లో బిజెపికి తిరుగులేని మెజార్టీ ఇస్తారని, దానికి నిదర్శనమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీకి పూర్తిస్థాయిలో మెజారిటీనీ ప్రజలు అందించారని, బిజెపి నాయకులు, మాజీ మేయర్ సునీల్ రావు డిల్లి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం మీడియా సమావేశంలో మేయర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు బీజేపీదే అనేందుకు ఈ ఎన్నికల ఫలితాలే ప్రతిపక్ష పార్టీలకు సమాధానం ఇస్తున్నాయన్నారు. ఢిల్లీ ప్రజలు ఆప్ పార్టీని చీపురుతో చెత్త ను ఊడ్చినట్టు ఊడ్చేశారనీ ఆరోపించారు. కాంగ్రెస్ కు అక్కడ గుండు సున్న వచ్చిందనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గుర్తించుకోవాలను సూచించారు. భవిష్యత్తు లో తెలంగాణ గల్లి నుంచి డిల్లి దాక బిజెపి కాషాయ జెండనే రెపరెప లాడుతుందనీ. 70 అసెంబ్లీ సీట్లలో దాదాపు 50 సీట్లకు దగ్గరగా బిజెపి ఎంఎల్ఏ లు గెలిచారనీ చెప్పారు.ఇది చారిత్రాత్మకమైన తీర్పని, సుమారు 27ఏళ్ల తరువాత డిల్లీ గడ్డమీద బిజెపి జెండా ఎగుర బోతుందనీ సంతోషం వ్యక్తం చేశారు.ఇదే పంథా కరీంనగర్ లో భవిష్యత్తులో రిపీట్ అవుతుందనీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ సారథ్యంలో ఏ ఎన్నికలు వచ్చినా బిజెపి పక్షాన ప్రజలు నిలబడుతారనీ ఆశాభావం వ్యక్తం చేశారు.
కరీంనగర్, ఫిబ్రవరి 8(భారత శక్తి):
దేశ ప్రధాని మోది విజన్ తో రాబోయో రోజుల్లో భారతదేశంలోనీ అన్ని రాష్ట్రాల్లో బిజెపికి తిరుగులేని మెజార్టీ ఇస్తారని, దానికి నిదర్శనమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీకి పూర్తిస్థాయిలో మెజారిటీనీ ప్రజలు అందించారని, బిజెపి నాయకులు, మాజీ మేయర్ సునీల్ రావు డిల్లి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం మీడియా సమావేశంలో మేయర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు బీజేపీదే అనేందుకు ఈ ఎన్నికల ఫలితాలే ప్రతిపక్ష పార్టీలకు సమాధానం ఇస్తున్నాయన్నారు. ఢిల్లీ ప్రజలు ఆప్ పార్టీని చీపురుతో చెత్త ను ఊడ్చినట్టు ఊడ్చేశారనీ ఆరోపించారు. కాంగ్రెస్ కు అక్కడ గుండు సున్న వచ్చిందనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గుర్తించుకోవాలను సూచించారు. భవిష్యత్తు లో తెలంగాణ గల్లి నుంచి డిల్లి దాక బిజెపి కాషాయ జెండనే రెపరెప లాడుతుందనీ. 70 అసెంబ్లీ సీట్లలో దాదాపు 50 సీట్లకు దగ్గరగా బిజెపి ఎంఎల్ఏ లు గెలిచారనీ చెప్పారు.ఇది చారిత్రాత్మకమైన తీర్పని, సుమారు 27ఏళ్ల తరువాత డిల్లీ గడ్డమీద బిజెపి జెండా ఎగుర బోతుందనీ సంతోషం వ్యక్తం చేశారు.ఇదే పంథా కరీంనగర్ లో భవిష్యత్తులో రిపీట్ అవుతుందనీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ సారథ్యంలో ఏ ఎన్నికలు వచ్చినా బిజెపి పక్షాన ప్రజలు నిలబడుతారనీ ఆశాభావం వ్యక్తం చేశారు.
