అధికారుల సూచనలు భక్తులు పాటించాలి: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 11 (భారత శక్తి) : నేటి (బుధవారం) నుండి ప్రారంభం కానున్న మినీ మేడారం జాతరకు అన్ని జాతర ప్రత్యేక ఏర్పాట్లను పూర్తి, వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు అధికారుల సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లా ఎస్.ఎస్.తాడువాయి మండలం మేడారం గ్రామంలో జరుగనున్న మినీ మేడారం జాతరను పురస్కరించుకొని గత పక్షం రోజుల నుండి పారిశుద్ధ పనులను చేపట్టడం జరిగిందని, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో భక్తులు జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరించడానికి నల్లాలు ఏర్పాటు చేయడం మహిళలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేశామని అన్నారు. జాతరలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించడం జరిగిందని, గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద భక్తులు ఎలాంటి ఇబ్బందుల గురికాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. ఏటూరు నాగారం మండలం కొండాయి, ఐలాపూర్ గ్రామాలలో జరుగనున్న మినీ మేడారం జాతరకు సైతం ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చిన్న బోయిన పల్లి గ్రామం నుండి కొండాయి వరకు, తాడ్వాయి, ఊరటం గ్రామాల నుండి కొండాయి వరకు భక్తులను తరలించడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారని తెలిపారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకొని సంతోషంగా తమ గ్రామాలకు చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ములుగు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 11 (భారత శక్తి) : నేటి (బుధవారం) నుండి ప్రారంభం కానున్న మినీ మేడారం జాతరకు అన్ని జాతర ప్రత్యేక ఏర్పాట్లను పూర్తి, వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు అధికారుల సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ములుగు జిల్లా ఎస్.ఎస్.తాడువాయి మండలం మేడారం గ్రామంలో జరుగనున్న మినీ మేడారం జాతరను పురస్కరించుకొని గత పక్షం రోజుల నుండి పారిశుద్ధ పనులను చేపట్టడం జరిగిందని, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో భక్తులు జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరించడానికి నల్లాలు ఏర్పాటు చేయడం మహిళలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేశామని అన్నారు. జాతరలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించడం జరిగిందని, గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద భక్తులు ఎలాంటి ఇబ్బందుల గురికాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. ఏటూరు నాగారం మండలం కొండాయి, ఐలాపూర్ గ్రామాలలో జరుగనున్న మినీ మేడారం జాతరకు సైతం ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చిన్న బోయిన పల్లి గ్రామం నుండి కొండాయి వరకు, తాడ్వాయి, ఊరటం గ్రామాల నుండి కొండాయి వరకు భక్తులను తరలించడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారని తెలిపారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకొని సంతోషంగా తమ గ్రామాలకు చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు.
