సృజనాత్మకతకు కేరాఫ్‌గా యాలాల పీఎం శ్రీ పాఠశాల

  • విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్న వేసవి శిబిరం
  • మట్టి కళలు, కూచిపూడి, ఇంద్రజాలంతో సందడిగా క్యాంప్
  • యాలాల విద్యాధికారి పాఠశాల ఉపాధ్యాయుల ప్రత్యేక కృషి అభినందనీయం 

సృజనాత్మకతకు కేరాఫ్‌గా యాలాల పీఎం శ్రీ పాఠశాల

వికారాబాద్:

వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలోని పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల సృజనాత్మకతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక వేసవి శిబిరం విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ అద్భుతంగా కొనసాగుతోంది.

ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని 21 పీఎం శ్రీ పాఠశాలల్లో 15 రోజులపాటు ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. యాలాల పాఠశాలలో సుమారు వంద మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

కార్పొరేట్ స్థాయి సమ్మర్ క్యాంప్‌లను తలపించేలా ఇక్కడ విద్యార్థులకు విభిన్న అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. భారతీయ సాంప్రదాయ చేతివృత్తులను పరిచయం చేస్తూ పర్యావరణ హితమైన మట్టి పాత్రలు, చిన్న చిన్న మట్టి వస్తువుల తయారీని కుమ్మరి వృత్తిదారుల సహాయంతో ప్రత్యక్షంగా చూపించారు. పిల్లలు స్వయంగా మట్టితో వస్తువులు తయారు చేస్తూ ఆసక్తిగా పాల్గొన్నారు.

ఇదే కాకుండా కూచిపూడి నాట్యం, ఇంద్రజాల విద్యలు, ఇండోర్ గేమ్స్, దేశభక్తి గేయాలు, చక్కటి చూచిరాత వంటి అంశాల్లో కూడా నిపుణులైన వాలంటీర్లు, ఉపాధ్యాయులు ప్రతిరోజూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విద్యతో పాటు సంస్కృతి, కళలు, వ్యక్తిత్వ వికాసంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.WhatsApp Image 2026-05-19 at 19.50.45 (3)

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ప్రకృతి ప్రేమను పెంపొందించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో శ్రీనిజ విద్యార్థులతో కలిసి మట్టి వస్తువులు తయారు చేస్తూ వారిని ప్రోత్సహించారు.

చదువుతో పాటు అన్ని రంగాల్లో పిల్లలను ముందంజలో నిలిపేందుకు ఈ వేసవి శిబిరం ఎంతగానో ఉపయోగపడుతోందని ఇందులో మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాడు సిద్రామేశ్వర్, ఉపాధ్యాయ బృందం కృషి అభినందనీయం అని స్థానికులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటున్నారు.WhatsApp Image 2026-05-19 at 19.50.45 (2)

About The Author