'రన్ ఫర్ రెనోవేషన్ ఆఫ్ లేక్' నినాదంతో
సరూర్ నగర్ చెరువుపై 3కే రన్
ఎల్బీనగర్:
టీపీసీసీ అధికార ప్రతినిధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో “రన్ ఫర్ రినోవేషన్ అఫ్ సరూర్నగర్ లేక్ నినాదంతో నిర్వహించిన భారీ 3కే రన్ కార్యక్రమం విజయవంతమైంది. వేలాది మంది వాకర్స్, లేక్ లవర్స్, వివిధ కాలనీలు, డివిజన్ల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని సరూర్‌నగర్ చెరువును ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పునరుద్ధరిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రూ.24 కోట్లతో చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని హైడ్రా శాఖ సహకారంతో మరో రూ.88 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోద ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు మల్ రెడ్డి రాంరెడ్డి, కల్వ సుజాత, అన్వేష్ రెడ్డి, నల్గొండ గద్దర్, సినీనటి పాయల్ రాధాకృష్ణ, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నల్గొండ గద్దర్ నరసన్న మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిస్తూ ప్రత్యేక గీతాన్ని వినిపించారు. “సర్వ మతాల సమ్మేళనం – అందరూ మా వాళ్లే, అందరి అభివృద్ధే మా లక్ష్యం” అనే భావనతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని దర్పల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి కార్యకర్తకు, కాలనీ సభ్యులకు, పోలీస్ అధికారులు సీఐ శ్రీశైలం, ఎస్ఐలు లక్ష్మణ్, శిరీష, జిహెచ్ఎంసి అధికారులు రాంబాబు, చందన, బుచ్చయ్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు..jpeg)
