ప్రజా సంఘాల మహాధర్నాలో పాల్గొన్న కామారెడ్డి ప్రజా సంఘాల జిల్లా నాయకులు
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 10: బిజెపి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడాన్ని నిరసిస్తూ ఈరోజు హైదరాబాదులోని ఇందిరా పార్క్ దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మహా ధర్నాలో రాష్ట్ర నలుమూలల నుండి కార్మికులు కర్షకులు రైతులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడా బాబులకు తప్ప పేదలకు కాదని నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ మహా ధర్నాకు కామారెడ్డి సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూత్రం నాయక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ తో పాటు జిల్లా నుండి 100 మంది పాల్గొన్నారు.
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 10: బిజెపి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడాన్ని నిరసిస్తూ ఈరోజు హైదరాబాదులోని ఇందిరా పార్క్ దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మహా ధర్నాలో రాష్ట్ర నలుమూలల నుండి కార్మికులు కర్షకులు రైతులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడా బాబులకు తప్ప పేదలకు కాదని నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈ మహా ధర్నాకు కామారెడ్డి సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూత్రం నాయక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ తో పాటు జిల్లా నుండి 100 మంది పాల్గొన్నారు.
