చెల్లాపూర్ లక్ష్మి నర్సింహ స్వామి ఆలయానికి రూ. లక్ష విరాళం
- భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు
- సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి
సిద్దిపేట
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డులోని శ్రీ రాజ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవో పేతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, భక్తిశ్రద్ధలతో కళ్యాణ క్రతువును వీక్షించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుక భక్తులను ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంది. అనంతరం లక్ష్మి నర్సింహా స్వామి దేవాలయాన్ని దర్శించుకుని లక్ష రూపాయలు విరాళం అందజేశారు.ఈ సందర్భంగా రఘువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, లోకకల్యాణం కోసం శ్రీరామచంద్రుడు చూపిన ధర్మమార్గం నేటి సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాముని ఆచరణీయమైన ఆదర్శాలను అనుసరిస్తూ క్రమశిక్షణ, సత్యం, ధర్మబద్ధమైన జీవనం గడపాలని ఆకాంక్షించారు. అలాగే ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రఘువర్ధన్ రెడ్డిని ఆలయకమిటీ సభ్యులు సన్మానించారు.ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీతారాముల ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు కనకరాజు, ఎల్లవ్వ, బాలకిషన్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి,నగరం రాజి రెడ్డి, పద్మయ్య,ఆలయ కమిటీ సభ్యులు దేవరాజు, సంతోష్, మహేష్, దేవయ్య, నవీన్, గ్రామ పెద్దలు జీవన్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, సోమయ్య, లక్ష్మిపతి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..jpeg)
