వీధి వీధిలో మారుమోగిన శ్రీ రామ నామం
ఎల్బీనగర్:
శ్రీ రామనవమి సందర్భంగా కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో దేవాలయంలో సంప్రదాయంగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కమలా రెడ్డి దంపతులు కలిసి తలంబ్రాలు,పట్టు వస్త్రాలు సమర్పించారు.అదే విధంగా మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ డివిజన్ జింకలబావి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కమిటీ సభ్యులు మాధవ రెడ్డి, వెంకటేష్ యాదవ్, హనుమాన్ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సీతా రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపి, కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు అన్న వితరణ గావించారు.
About The Author
28 Mar 2026
