ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం

  •  మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం
  •  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
  • తిమ్మాపూర్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం

సిద్దిపేట:

 కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే  మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుతున్నాయని,
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా హెల్త్ క్యాంప్ ని పీ హెచ్ సి పరిధిలోని గ్రామాల  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిమ్మాపూర్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ అన్నారు. బుధవారం దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్ పీహెచ్సిలో  ప్రజపాలన కార్యక్రమంలో భాగంగా మెగా హెల్త్ క్యాంపును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, పాలకవర్గం సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి క్యాంపును ప్రారంభించారు. సర్పంచ్ స్వయంగా రక్త పరీక్షలు చేయించుకొని ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
అనంతరం వైద్య బృందం గ్రామస్తులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఉచితంగా  మందులను పీహెచ్సి వైద్యధికారి దివ్య శ్రీ , పాలకవర్గం సభ్యులు, వైద్య సిబ్బందితో కలిసి అందజేశారు. ఈ హెల్త్ క్యాంపు ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని
పేర్కొన్నారు.అనంతరం పీహెచ్సి వైద్యధికారి దివ్య శ్రీ
మాట్లాడుతూ మెగా హెల్త్ క్యాంప్ లో పెడియాట్రిక్స్,
డెంటల్,జనరల్  మెడిసిన్, ఆర్థోపెడిక్,ఆఫ్తాల్మాలజీ,
ఓబీజీ, గైనకాలజీ విభాగాల్లో మొత్తం 250 మంది వైద్య పరీక్షలు చేశామన్నారు. ప్రజా ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, స్వామి, పద్మనాభునిపల్లి సర్పంచ్ వేముల అరుణ రాజేశం, తిమ్మాపూర్ ఉపసర్పంచ్లు వన్నెల విజయ్ కుమార్ , రుద్రారం యాదగిరి,వార్డ్ మెంబర్లు మండల కనకయ్య, మహిళలు, యువత పీహెచ్సి సిబ్బంది సిహెచ్ఓ అలకనంద, హెచ్ఈఓ లు రాజేందర్ కొండయ్య, ఎంఎన్వో యాదగిరి, ఎంపి హెచ్సి శ్యామల శోభ రాణి, ఫార్మసిస్ట్ నవీన్ హెల్త్ అసిస్టెంట్ గణేష్, ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు  ఉన్నారు.WhatsApp Image 2026-03-25 at 19.35.49

About The Author