ఎన్జీవోస్‌ కాలనీ లైబ్రరీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.

  • బీజేపీ కార్పొరేటర్ల వల్లే పనులు ఆగాయి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
  • ​అధికారులకు స్పాట్‌లోనే ఆదేశాలు.. కాలనీవాసుల హర్షం.

ఎన్జీవోస్‌ కాలనీ లైబ్రరీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.

వనస్థలిపురం:

ఎన్జీవోస్‌ కాలనీలో ఎన్నాళ్ల నుంచో పెండింగ్‌లో ఉన్న లైబ్రరీ నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. బుధవారం నుంచే పనులు పునఃప్రారంభం కానున్నాయి. మంగళవారం కాలనీ గ్రౌండ్‌లో కాలనీ పెద్దలు, స్థానికులతో నిర్వహించిన సమావేశానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లైబ్రరీ పనులు వెంటనే పూర్తి చేయాలని కాలనీవాసులు ఆయనను కోరారు.

​రాజకీయాల వల్లే జాప్యం..
సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లైబ్రరీ పనులను తాను ఎప్పుడూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కేవలం కొందరు బీజేపీ కార్పొరేటర్లు చేసిన రాద్దాంతం, వారి దుందుడుకు చర్యల వల్లే పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. రాజకీయ కారణాలతో కాలనీ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు.

​అధికారులకు ఎమ్మెల్యే ఆర్డర్..
పనుల జాప్యంపై స్పందించిన ఎమ్మెల్యే.. అక్కడే ఉన్న గ్రంథాలయ ఈఈ, డీఈలతో మాట్లాడారు. రేపటి నుంచే (బుధవారం) పనులు మొదలుపెట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదని స్పాట్‌లోనే ఆదేశాలిచ్చారు. పనులు మళ్లీ స్టార్ట్ అవుతుండటంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని, పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డిని కాలనీ సభ్యులు సన్మానించారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు కాలనీ పెద్దలు సోమయాజులు, పంపన్న వెంకటేశ్వర, శివనాగేశ్వర్ రావు, జైపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, ఓంప్రకాష్, భూషణ్, విశ్వనాథం, శ్యాంకుమార్, ఆనంద్ తో పాటు అనిల్ చౌదరీ, రాఘవేందర్ రావు, కొంగర మహేష్, రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author