​నూతన వధూవరులను ఆశీర్వదించిన పారిజాత నర్సింహారెడ్డి

​నూతన వధూవరులను ఆశీర్వదించిన పారిజాత నర్సింహారెడ్డి

​శంషాబాద్:

శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం ప్రవీణ్ కుమార్ రెడ్డి, వైష్ణవిల వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె నూతన వధూవరులను పుష్పగుచ్ఛంతో అభినందించి, అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
​కార్యక్రమంలో ఆమెతో పాటు నాయకులు పోరెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాహ వేడుకకు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, ఆత్మీయులు హాజరై సందడి చేశారు.

About The Author