కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము

కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము

ఎల్బీనగర్:

శ్రీరామనవమి సందర్భంగా సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని
వేంకటేశ్వర కాలనీలో గల శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు వంశీధరాచార్యులు, రామక్రిష్ణామా చార్యులు, శ్యాంసుందర్ వేదోచ్ఛరణల మధ్య జరిగిన సీతారాముల కళ్యాణాన్ని తిలకించడానికి రెండుకనులు సరిపోలేదు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి పోటెత్తడంతో ఆలయ పరిసరాలన్ని భగవన్నామస్మరణతో మారుమ్రోగాయి. కళ్యాణం అనంతరం నిర్వహించిన అన్నసంతర్పణలో భక్తులు అందరు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ భక్తులను ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దర్పల్లి అశోక్, కాలనీ అధ్యక్షుడు గండు ధనంరెడ్డి, ఆలయ వైస్ చైర్మన్ ఎం.శాంతిప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎం. నాగభూషన్రావు, కోశాధికారి ఆర్.శ్రీమన్నారాయణ, జాయింట్ సెక్రెటరీ తులసీ క్రిష్ణమూర్తి, సభ్యులు మారోజు శ్రీనివాస్ రావు, కనకారావు, భోగేశ్వర్రావు, సుబ్బారావు, టి.శ్రీనివాసరావు, ఎం.సుధాకర వారి,ఎం. నరేశ్, నప్పిడి గోవర్ధన్ రెడ్డి, కిరణ్ యాదవ్, సురేందర్రాజులతో పాటు కాలనీ వాసులు, మహిళామండలి సభ్యులు సాల్గొన్నారు.

About The Author