తెలంగాణ రాష్ట్రంలో ఒకే రెడ్డి సంఘంగా ఏర్పడిన రాష్ట్ర రెడ్డి సంఘాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఒకే రెడ్డి సంఘంగా ఏర్పడిన రాష్ట్ర రెడ్డి సంఘాలు.

ఎల్బీనగర్:

హైదరాబాద్ నాగోల్ ప్రాంతంలో పిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో బద్దూరి వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన  నూతన హడ్ హాక్ కమిటీ  ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రెడ్ల భవిష్యత్తు, భద్రత, ఆర్థిక, రాజకీయ, అసమానతలు ఎదురవుతున్న ఇబ్బందుల దృశ్యా మంగళవారం అన్నీ సంఘాలు కూడా ఏక వాక్య తీర్మానంతో ఒకే సంఘాన్ని రాష్ట్రంలో ఒకటే రెడ్డి సంఘం ఉండాలనే నినాదంతో అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ యొక్క సాహసోపేతమైన  నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద రెడ్లకు, పేద రెడ్డి విద్యార్థులకు మేమున్నామని ఈ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు కోసం వారికి భరోసా ఇవ్వడం జరుగుతుంది.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక వర్గంతో పాటు బడ్జెట్ కూడా కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఆయా సామాజిక వర్గ ప్రజలకి రాష్ట్ర స్థాయిలో ఏదైతే ప్రభుత్వాలు వారికి హైదరాబాద్ నడిబొడ్డున కుల భవనాలు నిర్మించి ఇచ్చిందో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర రెడ్ల కోసం పది ఎకరాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.రానున్న రోజుల్లో రెడ్ల సంక్షేమం కోసం ప్రభుత్వానికి, పేద రెడ్లకు మధ్యలో వారధిగా ఉండి పేద రెడ్ల సంక్షేమానికి ముందు ఉంటామని కొత్తగా ఏర్పడిన కార్యవర్గం ఈ సందర్భంగా శపథం చేశారు.
 రాష్ట్ర అడ్ హాక్ కమిటీ చైర్మన్ గా బద్దూరి వెంకటేశ్వర రెడ్డి కన్వీనర్ బుట్టెంగారి మాధవరెడ్డి, కో కన్వీనర్లుగా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, కొట్టం మధుసూదన్ రెడ్డి, వసంత రెడ్డి, నూకల పద్మ రెడ్డి, గంగుల శ్రీలత రెడ్డి, నందికొండ గీతారెడ్డి సభ్యులుగా ఎన్నేపల్లి లింగారెడ్డి,  ఎలిమినేటి సుమన్ రెడ్డి, సలహా దారులుగా ఏనుగు సంతోష్ రెడ్డి, పిట్టా శ్రీనివాస్ రెడ్డి, గోపు జైపాల్ రెడ్డి, నల్ల సంజీవరెడ్డి, నావల్గా సత్యనారాయణ రెడ్డి, బొక్క భూపాల్ రెడ్డి, బొబ్బిలి దామోదర్ రెడ్డి నియమించబడ్డారు.WhatsApp Image 2026-03-24 at 19.48.54

About The Author