ఉపాధ్యాయుల జీతాల్లో హెల్త్ కార్డు ప్రీమియం కోతలు సమంజసం కావు: తపస్

  • విధివిధానాలు ప్రకటించకుండానే ప్రీమియం వసూలు చేయడం ఏమిటి?
  • హెల్త్ కార్డులు జారీ చేసిన తర్వాతే ప్రీమియం కోతలు విధించాలి తపస్ డిమాండ్ 

ఉపాధ్యాయుల జీతాల్లో హెల్త్ కార్డు ప్రీమియం కోతలు సమంజసం కావు: తపస్

వికారాబాద్:

ఉపాధ్యాయుల జీతభత్యాల నుండి హెల్త్ కార్డు ప్రీమియం పేరుతో కోతలు విధించడం సమంజసం కాదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బసవరాజ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తపస్ సంఘం ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బసవరాజ్ పేర్కొంటూ
హెల్త్ కార్డుల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన విధివిధానాలు ప్రకటించలేదని అన్నారు. హాస్పిటళ్లతో సమావేశాలు నిర్వహించలేదని, ఉపాధ్యాయ సంఘాలకు పూర్తి వివరాలు తెలియజేయలేదని  అన్నారు. అలాగే అధికారికంగా హెల్త్ కార్డులు జారీ చేయకుండానే ఉపాధ్యాయుల జీతాల నుంచి ప్రీమియం పేరుతో డబ్బులు కోత విధించడం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేసే చర్య అన్నారు.
ప్రభుత్వం ఇప్పటివరకు వసూలు చేసిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు అధికారికంగా జారీ చేసిన తర్వాత, వాటి వినియోగానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసిన అనంతరం మాత్రమే ప్రీమియం కోతలు విధించాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే ఈ పథకం పట్ల ఆసక్తి లేని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు స్కీం నుంచి మినహాయింపు కల్పించాలని సూచించారు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న సందర్భాల్లో ఒకరి నుంచే ప్రీమియం వసూలు చేసే విధానం అమలు చేయాలని కోరారు.
యువతకు కూడా హెల్త్ కార్డు ప్రయోజనాలు అందేలా ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒకే విధమైన ప్రీమియం చెల్లింపు విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం హెల్త్ కార్డు పథకంపై స్పష్టత ఇవ్వాలని, పారదర్శకంగా అమలు చేయాలని తపస్ నాయకులు  విజ్ఞప్తి చేశారు.WhatsApp Image 2026-05-31 at 19.14.27

About The Author