నీలోఫర్, ఎంఎన్‌జే ఆసుపత్రుల వద్ద‘రెడీ టు సర్వ్’ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.

నీలోఫర్, ఎంఎన్‌జే ఆసుపత్రుల వద్ద‘రెడీ టు సర్వ్’ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.

హైదరాబాద్:

నగరంలోని నీలోఫర్, ఎంఎన్‌జే ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ‘రెడీ టు సర్వ్ ఫౌండేషన్’, ‘అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల సహాయకులు, నిరుపేదలకు ఈ సందర్భంగా భోజన వసతి కల్పించారు.

*నిరంతరం సేవా కార్యక్రమాలు
సమాజంలో ఆకలితో అలమటించే వారికి అండగా నిలిచేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. ఫౌండేషన్ సభ్యులు, వాలంటీర్లు పాల్గొని వందలాది మందికి ఆహారాన్ని పంపిణీ చేశారు. ఆసుపత్రుల వద్ద గంటల తరబడి వేచి ఉండే తమకు ఈ భోజన సదుపాయం ఎంతో ఊరటనిచ్చిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సేవా వితరణలో భాగస్వాములు కావాలనుకునే వారు తమను సంప్రదించవచ్చని ఫౌండేషన్ ప్రతినిధి పెద్దిశంకర్ ఒక ప్రకటనలో కోరారు.

About The Author