లోక్‌భవన్‌లో గవర్నర్‌తో కీలక భేటీలు

శాంతిభద్రతలపై డీజీపీ, విద్యా సంస్కరణలపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్ చర్చ

లోక్‌భవన్‌లో గవర్నర్‌తో కీలక భేటీలు

హైదరాబాద్:
 
రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను బుధవారం లోక్‌భవన్‌లో పలువురు ప్రముఖులు, వివిధ రంగాల ప్రతినిధులు విడివిడిగా కలుసుకున్నారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, మహిళా సాధికారత వంటి పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి.

*శాంతిభద్రతలపై సమీక్ష
తొలుత రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సీవీ ఆనంద్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్ గవర్నర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితిని, పోలీసులు తీసుకుంటున్న ముందస్తు చర్యలను వారు గవర్నర్‌కు వివరించారు.

*విద్యా సంస్కరణలపై చర్చ
అనంతరం ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వి. బాలకిష్టారెడ్డి గవర్నర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలు తీరును, ఉన్నత విద్యా రంగంలో ప్రవేశపెడుతున్న నూతన సంస్కరణలను ఆయన గవర్నర్‌కు వివరించారు.

*బీమా రంగంపై చర్చలు
కడేల్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సోహన్‌లాల్ కడేల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా గవర్నర్‌ను కలిసింది. దేశంలో, రాష్ట్రంలో బీమా రంగానికి సంబంధించిన ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్తు అవకాశాలపై వారు ఈ సందర్భంగా చర్చించారు.

*బీజేపీ నేతల భేటీ
బీజేపీ మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. మల్లారెడ్డి నేతృత్వంలోని ఒక ప్రతినిధి బృందం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించింది.

*మహిళా సాధికారతకు అండ
‘5వ ఎడిషన్ భారత్ కే అన్మోల్ నారీ శక్తి అవార్డ్స్-2026’ నిర్వాహకుడు మహ్మద్ నిజాముద్దీన్ తన బృందంతో కలిసి గవర్నర్‌ను కలుసుకున్నారు. మహిళా సాధికారత కోసం తమ సంస్థ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను, అవార్డుల ప్రధానోత్సవ వివరాలను వారు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు.WhatsApp Image 2026-05-20 at 19.36.17

About The Author