ఐక్య ఉద్యమాలతోనే ఇండ్ల స్థలాలు సాధ్యం: జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు

ఖమ్మం బ్యూరో, భారత శక్తి, ఫిబ్రవరి 8 : మూడు దశాబ్దాల జర్నలిస్టుల సొంతింటి కల సహకారం చేసుకునేందుకు జర్నలిస్టులు ఐక్యతతో ఉద్యమాలకు సిద్ధం కావాలని ఖమ్మం స్తంభాద్రి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు అధ్యక్షతన శనివారం జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధనకోసం జరిగిన యుద్ధభేరి సన్నహాక సమావేశంలో సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు పాల్గొని ప్రసంగించారు. అనేక ఏండ్లుగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని కానీ జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించటం బాధాకరమని అన్నారు. ఇప్పటికే అనేకమార్లు మంత్రులను, అధికారులను సంప్రదించామని కానీ అనుకున్న లక్ష్యం ఇంకా నెరవేరలేకపోవడం బాధను కలిగిస్తుందన్నారు. మూడు ప్రధాన జర్నలిస్ట్ యూనియన్లు అయిన ఐజేయు, టీజేఎఫ్, ఫెడరేషన్ తో పాటు హౌసింగ్ సొసైటీ కృషితో అధికారుల ఆమోదంతో ఏ అడ్డంకి లేకుండా ఇండ్ల స్థలాలు వచ్చాయనుకున్న సందర్భంలో కుంటి సాకులతో అడ్డు పడడం తీవ్ర నిరాశలకు లోనయ్యామని అన్నారు. మూడు ప్రధాన యూనియన్లు, హౌసింగ్ సొసైటీ తో పాటు ప్రెస్ క్లబ్ కమిటీతో కలసి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు ప్రెస్ క్లబ్ వేదికగా యుద్ధభేరి మోగించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు ఉపాధ్యక్షులు మోహినుద్దీన్, టీజేఎఫ్ నగర ఉపాధ్యక్షులు అమరవరపు కోటేశ్వరరావు, పసుపులేటి సత్యనారాయణ, హెచ్ఎంటీవీ గణేష్, సీనియర్ సబ్ ఎడిటర్ అచ్చిరెడ్డి, ప్రెస్ క్లబ్ కోశాధికారులు నామా పురుషోత్తం, బిక్కి గోపి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, జర్నలిస్ట్ నాయకులు టీఎస్ చక్రవర్తి, ఎస్.కె జానీపాషా, మేడి రమేష్, గోవింద్, సంతోష్, పాశం వెంకటేశ్వర్లు, పానకాలరావు, అంతోటి శ్రీనివాస్, ఖాసిం, ప్రభాకర్ రెడ్డి, మందుల వెంకటేశ్వర్లు, వేల్పుల నాగేశ్వరరావు, నరేష్, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, అప్పారావు, వెంకట్ రెడ్డి, బాబు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, బిక్షం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఐక్య ఉద్యమాలతోనే ఇండ్ల స్థలాలు సాధ్యం: జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు,  ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు

ఖమ్మం బ్యూరో, భారత శక్తి, ఫిబ్రవరి 8 :
మూడు దశాబ్దాల జర్నలిస్టుల సొంతింటి కల సహకారం చేసుకునేందుకు జర్నలిస్టులు ఐక్యతతో ఉద్యమాలకు సిద్ధం కావాలని ఖమ్మం స్తంభాద్రి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు అధ్యక్షతన శనివారం జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధనకోసం జరిగిన యుద్ధభేరి సన్నహాక సమావేశంలో సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు పాల్గొని ప్రసంగించారు. అనేక ఏండ్లుగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని కానీ జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించటం బాధాకరమని అన్నారు. ఇప్పటికే అనేకమార్లు మంత్రులను, అధికారులను సంప్రదించామని కానీ అనుకున్న లక్ష్యం ఇంకా నెరవేరలేకపోవడం బాధను కలిగిస్తుందన్నారు. మూడు ప్రధాన జర్నలిస్ట్ యూనియన్లు అయిన ఐజేయు, టీజేఎఫ్, ఫెడరేషన్ తో పాటు హౌసింగ్ సొసైటీ కృషితో అధికారుల ఆమోదంతో ఏ అడ్డంకి లేకుండా ఇండ్ల స్థలాలు వచ్చాయనుకున్న సందర్భంలో కుంటి సాకులతో అడ్డు పడడం తీవ్ర నిరాశలకు లోనయ్యామని అన్నారు. మూడు ప్రధాన యూనియన్లు, హౌసింగ్ సొసైటీ తో పాటు ప్రెస్ క్లబ్ కమిటీతో కలసి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు ప్రెస్ క్లబ్ వేదికగా యుద్ధభేరి మోగించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు ఉపాధ్యక్షులు మోహినుద్దీన్, టీజేఎఫ్ నగర ఉపాధ్యక్షులు అమరవరపు కోటేశ్వరరావు, పసుపులేటి సత్యనారాయణ, హెచ్ఎంటీవీ గణేష్, సీనియర్ సబ్ ఎడిటర్ అచ్చిరెడ్డి, ప్రెస్ క్లబ్ కోశాధికారులు నామా పురుషోత్తం, బిక్కి గోపి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, జర్నలిస్ట్ నాయకులు టీఎస్ చక్రవర్తి, ఎస్.కె జానీపాషా, మేడి రమేష్, గోవింద్, సంతోష్, పాశం వెంకటేశ్వర్లు, పానకాలరావు, అంతోటి శ్రీనివాస్, ఖాసిం, ప్రభాకర్ రెడ్డి, మందుల వెంకటేశ్వర్లు, వేల్పుల నాగేశ్వరరావు, నరేష్, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, అప్పారావు, వెంకట్ రెడ్డి, బాబు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, బిక్షం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author