ప్రైవేట్ టీచర్లకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పిస్తా: పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
కరీంనగర్, ఫిబ్రవరి 8(భారత శక్తి): రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు ఆరోగ్య ఉద్యోగ భద్రత ప్రభుత్వం నుండి వచ్చే విధంగా వారికి భరోసా కల్పిస్తానని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెల్లడించారు.శనివారం బోధన్ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.బోధన్ పర్యటనకు విచ్చేసిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మంది యువతతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. భారీ క్రేన్ సహాయంతో గజమాలవేసి ఘనంగా సన్మానించారు.అనంతరం బోధన్ పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని దేశం మొత్తం ఎన్నికల వైపే చూస్తుందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిస్తే ఆ ప్రభావం ఎన్నికల్లో సులువు అవుతుందని వెల్లడించాడు.విద్యారంగ సమస్యలపై అవగాహన ఉన్న తనకు కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకముంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసీసీ పెద్దలకు రాష్ట్ర నాయకత్వానికి రుణపడి ఉంటానని.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్సీ సీటు బహుమతిగా ఇస్తానని పేర్కొన్నారు. రాజకీయాల్లో నూతన ఉరవడి సృష్టించేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఉద్యోగ నిరుద్యోగ పట్టభద్రులకు బాసటగా నిలిచేందుకే తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు.తనను కార్పొరేట్ శక్తులు అని తన ప్రత్యర్ధులు విష ప్రచారం చేస్తున్నారని ఈ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక సామాన్యమైన నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఒక సైకిల్ పైన చిన్న ట్యుటోరియల్ ఏర్పాటు స్థాపించి జీవిత ప్రయాణానికి ప్రారంభించామని ఒక మ్యాథమెటిక్స్ టీచర్ గా తన ప్రస్తావన మొదలైందని స్వయంకృషితో పిల్లల మనసు దోచుకుని అభివృద్ధి చెందినట్టు వెల్లడించారు.తన 54 సంవత్సరాల కాలంలో 54 విద్యాసంస్థలు నెలకొల్పి 5 వేల మంది కీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.రానున్న పట్టభద్రులు ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి, గంగా శంకర్ తహేర్ బాయ్ కిషోర్ రాజిరెడ్డి సూర్య ప్రకాష్ ఎమ్మెస్ జోషి తదితరులు పాల్గొన్నారు.