వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

సిద్దిపేట:

కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి నిల్వ ఉంచిన ధాన్యపు బస్తాలను వెంటనే కొనుగోలు చేయాలని పెద్దగుండవెల్లి రైతులు డిమాండ్ చేస్తూ సిద్దిపేట-మెదక్ హైవే (ఎన్‌హెచ్ 765డి)పై ఆందోళన చేపట్టారు. లారీలు రాకపోవడంతో ధాన్యం నిల్వ ఉండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక బస్తాకు 41 కిలోలు వేయాల్సి ఉండగా 42 కిలోల వరకు తూకం వేస్తున్నారని రైతులు సంజీవ్ రెడ్డి, మల్లారెడ్డి ఆరోపించారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు. ఆందోళనతో హైవేపై రాకపోకలకు అంతరాయం కలగగా, దుబ్బాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు.ఈ ధర్నాలో రైతులు మల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రవి, భాస్కర్, మహిపాల్, ముత్యం, గణేష్, తదితర రైతులు ఉన్నారు.WhatsApp Image 2026-05-19 at 19.52.37

About The Author