ఇందిరమ్మ మోడల్ హౌస్ ను నాణ్యతతో నిర్మించాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

హనుమకొండ ప్రతినిధి(భారత శక్తి)ఫిబ్రవరి10: ఇందిరమ్మ మోడల్ హౌస్ ను నిబంధనల మేరకు నాణ్యతతో నిర్మాణం పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌజ్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ మోడల్ హౌస్ ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు, సెట్ బ్యాక్ ఎంత పెట్టారు, మెటీరియల్ ఏమి వాడుతున్నారు, క్యూరింగ్ ఏవిధంగా చేస్తున్నారు, ఏ బ్రిక్స్ వాడుతున్నారు, తదితర వివరాలను హౌసింగ్ అధికారి రాజేందర్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి ఉపయోగపడే సిమెంట్ ఇటుకల తయారీని మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అందించే నిధులతో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా ఉంటుందో మోడల్ హౌస్ ఉండేలా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ సదానందం, ఎంపీడీవో అనిల్ కుమార్, ఎంఈఓ రాంధన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ధర్మసాగర్ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్, సాంఘిక సంక్షేమ హాస్టల్, దేవాదుల క్వార్టర్స్ నిరుపయోగంగా ఉండడంతో వాటిని అధికారులతో కలిసి సోమవారం కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్స్, దేవాదుల క్వార్టర్స్ నిరుపయోగంగా ఉండడానికి గల కారణాలను సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి నుంచి హనుమకొండకు హాస్టల్స్ ను మార్చిన విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటి విషయమై కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులు అందించే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. హాస్టల్స్ ను తిరిగి తీసుకువచ్చే విషయమై పరిశీలన చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ఈడీ బాలరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ మోడల్ హౌస్ ను నాణ్యతతో నిర్మించాలి:   హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

హనుమకొండ ప్రతినిధి(భారత శక్తి)ఫిబ్రవరి10:
ఇందిరమ్మ మోడల్ హౌస్ ను నిబంధనల మేరకు నాణ్యతతో నిర్మాణం పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.

సోమవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌజ్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ మోడల్ హౌస్ ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు, సెట్ బ్యాక్ ఎంత పెట్టారు, మెటీరియల్ ఏమి వాడుతున్నారు, క్యూరింగ్ ఏవిధంగా చేస్తున్నారు, ఏ బ్రిక్స్ వాడుతున్నారు, తదితర వివరాలను హౌసింగ్ అధికారి రాజేందర్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి ఉపయోగపడే సిమెంట్ ఇటుకల తయారీని మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అందించే నిధులతో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా ఉంటుందో మోడల్ హౌస్ ఉండేలా నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ సదానందం, ఎంపీడీవో అనిల్ కుమార్, ఎంఈఓ రాంధన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అదేవిధంగా ధర్మసాగర్ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్, సాంఘిక సంక్షేమ హాస్టల్, దేవాదుల క్వార్టర్స్ నిరుపయోగంగా ఉండడంతో వాటిని అధికారులతో కలిసి సోమవారం కలెక్టర్ పరిశీలించారు.

హాస్టల్స్, దేవాదుల క్వార్టర్స్ నిరుపయోగంగా ఉండడానికి గల కారణాలను సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి నుంచి హనుమకొండకు హాస్టల్స్ ను మార్చిన విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటి విషయమై కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులు అందించే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. హాస్టల్స్ ను తిరిగి తీసుకువచ్చే విషయమై పరిశీలన చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ఈడీ బాలరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author