ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి అవకాశాలను యువత పొందాలి

జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి ఐఏఎస్

ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి అవకాశాలను యువత పొందాలి

ఎల్బీనగర్:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” – 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా 06.03.2026 నుండి 12.06.2026 వరకు పది (10) ముఖ్య అంశాలపై కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా “యూత్ అండ్ స్పోర్ట్స్” థీమ్‌ను 18.05.2026 నుండి 23.05.2026 వరకు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా మంగళవారం “కెరీర్ & స్కిల్ డెవలప్‌మెంట్ డే – ఎంపవర్ స్కిల్స్, ఎంపవర్ ఫ్యూచర్” కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, శ్రీమతి కిరణ్మయి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే జిల్లా అధికారులతో పాటు జిల్లా యువజన (డివైఎస్ఓ), శ్రీమతి స్వర్ణలత, కోచ్‌లు, సిబ్బంది, యువత పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ కోర్సులపై జిల్లా స్థాయిలో వర్చువల్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్యా అవకాశాలపై అవగాహన కల్పిస్తూ పలు అంశాలపై వివరాలు అందించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, యువత తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందాలని యువతకు సూచించారు.

About The Author