కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం : సూడా ఛైర్మన్ కోమటిరెడ్డి ఆరోపణ
కరీంనగర్, జనవరి 1(భారత శక్తి): కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ప్రభుత్వం పంపించిన నివేదికలను కేంద్రం పెడచెవిన పెట్టిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు.. ఈ సందర్బంగా ఆయన ఒక ప్రకటనలో తెలంగాణ నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ బడ్జెట్లో ప్రత్యేక నిధులు ఏమీ లేవని మండిపడ్డారు.. నిర్మల సీతారామన్ తెలుగు బిడ్డ అయి ఉండి అందులోనూ దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అని తెలుగు పద్యం చదివితే తాము ఆనందపడ్డామే, కానీ క్షణాల్లోనే ఆనందాన్ని ఆవిరి చేశారని నరేందర్ రెడ్డి ఆరోపించారు.. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించడం బిజెపికి ఆనవాయితీగా మారిందని పేర్కొన్నారు.. కేంద్ర ప్రభుత్వ తీరుపైన కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు రాష్ట్రానికి రావలసిన నిధులపై దృష్టి పెట్టాలని కోరారు.
కరీంనగర్, జనవరి 1(భారత శక్తి):
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ప్రభుత్వం పంపించిన నివేదికలను కేంద్రం పెడచెవిన పెట్టిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు.. ఈ సందర్బంగా ఆయన ఒక ప్రకటనలో తెలంగాణ నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ బడ్జెట్లో ప్రత్యేక నిధులు ఏమీ లేవని మండిపడ్డారు.. నిర్మల సీతారామన్ తెలుగు బిడ్డ అయి ఉండి అందులోనూ దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అని తెలుగు పద్యం చదివితే తాము ఆనందపడ్డామే, కానీ క్షణాల్లోనే ఆనందాన్ని ఆవిరి చేశారని నరేందర్ రెడ్డి ఆరోపించారు.. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించడం బిజెపికి ఆనవాయితీగా మారిందని పేర్కొన్నారు.. కేంద్ర ప్రభుత్వ తీరుపైన కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు రాష్ట్రానికి రావలసిన నిధులపై దృష్టి పెట్టాలని కోరారు.
