గ్రామ దేవాలయాల అభివృద్ధికి వంగ రాజేశ్వర్ రెడ్డి చేయూత
- రెండు ఆలయాలకు రూ.1 లక్ష విరాళం
సిద్దిపేట:
గ్రామ దేవాలయాల అభివృద్ధికి వంగ రాజేశ్వర్ రెడ్డి చేయూతనందిస్తూ బీరప్ప కామరతి–చౌడలమ్మ, పెద్దమ్మ–పెద్దిరాజుల ఆలయాలకు విడివిడిగా రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1 లక్ష విరాళం అందజేశారు.సిద్దిపేట రూరల్ మండలం ఏన్సాన్పల్లి గ్రామంలో నిర్వహించిన బీరప్ప కామరతి–చౌడలమ్మ కళ్యాణ మహోత్సవం, అలాగే నంగునూరు మండలం నర్మెట గ్రామంలో జరిగిన పెద్దమ్మ–పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. గ్రామ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల పెద్దలు, యాదవ కురుమ సంఘ నాయకులు, ముదిరాజ్ సంఘ సభ్యులు, మహిళలు, యువతతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
