జనాభా లెక్కల సేకరణలో ప్రతి ఒక్కరు సహకరించాలి..

మల్కాజిగిరి జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్..

జనాభా లెక్కల సేకరణలో ప్రతి ఒక్కరు సహకరించాలి..

మల్కాజిగిరి:

ప్రభుత్వ ఆదేశాల మేరకు జనగణన 2027 కార్యక్రమం నిర్వహించబడుచున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా జనగణన సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇంటికి సంబంధించి జనగణన వివరాలు సేకరించనున్నారని, దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మల్కాజిగిరి జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ కోరారు. కాబట్టి ప్రజలందరూ జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించి, సరైన, నిజమైన సమాచారాన్ని ఇవ్వాలన్నారు. సిబ్బంది గుర్తింపు కార్డులను కలిగి ఉండగా, ప్రజలు వివరాలు అందించే ముందు వాటిని పరిశీలించాలన్నారు. అలాగే గృహ యజమానులు, అపార్ట్‌మెంట్ సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు స్థానిక ప్రజాప్రతినిధులు  జనగణన సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలన్నారు.WhatsApp Image 2026-05-19 at 17.57.59 (1)

About The Author