ఎస్ఎఫ్ఐ నూతన జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా కాంపెళ్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్
కరీంనగర్, ఫిబ్రవరి 5(భారత శక్తి): భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 18వ జిల్లా మహాసభలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోనీ ముకుందా లాల్ మిశ్రా భవన్ చాలా అట్టహాసంగా జరిగాయి. ఈ ముగింపు మహాసభలకు రాష్ట్ర ప్రతినిధులు శనిగరపు రజినీకాంత్ నూతనంగా 25 మందితో జిల్లా కమిటీని ప్రకటించారు. నూతన జిల్లా కార్యదర్శిగా గజ్జెల శ్రీకాంత్ జిల్లా అధ్యక్షులుగా కాంపెల్లి అరవింద్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలియజేశారు. మిగితా కమిటీలో జిల్లా ఉపాధ్యక్షులు పోలిశెట్టి అభిలాష్ , ఆసంపల్లి వినయ్ సాగర్, నాగుల శ్రీజ, జిల్లా సహాయ కార్యదర్శి బోగేశ్వర్ , ఎల్కటూరు ఇసాక్, గట్టు ఆకాశ్, రిజ్వనా జిల్లా కమిటీ సభ్యులు సందేశ్ సురేష్ రోహిత్ రక్షక్, అనిల్, సిద్దివ్ , చరణ్, రాకేష్, రాజేష్, సందీప్ మానస సుష్మిత జయశ్రీ ఎన్నికయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికయిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కంపెల్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా వున్న విద్యారంగ సమస్యల పైన పోరాటం చేస్తాం అని తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 150 కోట్లకు పైగా పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి తక్షణమే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేసారు. జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టల్లో అన్ని అద్దె బోనాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉందనీ, వెంటనే సొంత భవనాలు నిర్మించాలని ఈ మహాసభలలో తీర్మానాలు చేయడం జరిగిందని చెప్పారు.
కరీంనగర్, ఫిబ్రవరి 5(భారత శక్తి):
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 18వ జిల్లా మహాసభలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోనీ ముకుందా లాల్ మిశ్రా భవన్ చాలా అట్టహాసంగా జరిగాయి. ఈ ముగింపు మహాసభలకు రాష్ట్ర ప్రతినిధులు శనిగరపు రజినీకాంత్ నూతనంగా 25 మందితో జిల్లా కమిటీని ప్రకటించారు. నూతన జిల్లా కార్యదర్శిగా గజ్జెల శ్రీకాంత్ జిల్లా అధ్యక్షులుగా కాంపెల్లి అరవింద్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలియజేశారు. మిగితా కమిటీలో జిల్లా ఉపాధ్యక్షులు పోలిశెట్టి అభిలాష్ , ఆసంపల్లి వినయ్ సాగర్, నాగుల శ్రీజ, జిల్లా సహాయ కార్యదర్శి బోగేశ్వర్ , ఎల్కటూరు ఇసాక్, గట్టు ఆకాశ్, రిజ్వనా జిల్లా కమిటీ సభ్యులు సందేశ్ సురేష్ రోహిత్ రక్షక్, అనిల్, సిద్దివ్ , చరణ్, రాకేష్, రాజేష్, సందీప్ మానస సుష్మిత జయశ్రీ ఎన్నికయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికయిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కంపెల్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా వున్న విద్యారంగ సమస్యల పైన పోరాటం చేస్తాం అని తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 150 కోట్లకు పైగా పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి తక్షణమే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేసారు. జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టల్లో అన్ని అద్దె బోనాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉందనీ, వెంటనే సొంత భవనాలు నిర్మించాలని ఈ మహాసభలలో తీర్మానాలు చేయడం జరిగిందని చెప్పారు.
