అజ్ఞాతం వీడి.. జనజీవన స్రవంతిలో కలవండి : పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ (ఐపిఎస్.)
మంచిర్యాల /ఫిబ్రవరి 05(భారత శక్తి): అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని వనం వీడి జనంలోకి వచ్చేలా కుటుంబ సభ్యులు చూడాలని రామగుండం కమీషనర్ ఎం.శ్రీనివాస్, ఐపిఎస్ తెలిపారు. బెల్లంపల్లి మండలం చంద్రవేళ్లి గ్రామం జాడి భాగ్య @ పుష్ప , జాడి వెంకటి మావోయిస్టు దంపతుల తల్లి మల్లమ్మ ను, కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. పుష్ప తల్లి మల్లమ్మ తో పాటు కుటుంబ సభ్యుల ప్రస్తుతస్థితిగతులతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై సీపీ అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దుప్పట్లు, నిత్యావసర సరకులను పోలీసు అధికా రులు అందజేశారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జాడి పుష్ప , జాడి వెంకటి లు మావోయిస్టు దంపతులు 1999 లో అజ్ఞాతంలోకి వెళ్లడం జరిగింది. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ వనం వీడి జనంలోకి వచ్చేలా చూడాలని ,లొంగిపోతే ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేస్తామని మావోయిస్టు పుష్ప తల్లి మల్లమ్మ, అన్న ఆవుల గంగారాం లను కోరడమైనది. ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో వుంది మావోయిస్టు పార్టీలో పని చేసి సాధించింది శూన్యమని. ఇకనైనా పుష్ప గారు అజ్ఞాతం వీడి జనంలోకి రావాలని, ప్రస్తుత రోజుల్లో మావోయిస్టులకు ప్రజాదరణ తగ్గిందని ఇవే కాకుండా అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారని. ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో హత మయ్యారని. అదేవిధంగా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే వారిపై ఉన్న రివార్డ్ పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజ నాలు అందేలా కృషిచేస్తామని సీపీ గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపిఎస్., బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ ఆఫజలొద్దీన్, తాళ్ళగురిజాల ఎస్ఐ రమేష్,, తదితర. పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాల /ఫిబ్రవరి 05(భారత శక్తి):
అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని వనం వీడి జనంలోకి వచ్చేలా కుటుంబ సభ్యులు చూడాలని రామగుండం కమీషనర్ ఎం.శ్రీనివాస్, ఐపిఎస్ తెలిపారు. బెల్లంపల్లి మండలం చంద్రవేళ్లి గ్రామం జాడి భాగ్య @ పుష్ప , జాడి వెంకటి మావోయిస్టు దంపతుల తల్లి మల్లమ్మ ను, కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. పుష్ప తల్లి మల్లమ్మ తో పాటు కుటుంబ సభ్యుల ప్రస్తుతస్థితిగతులతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై సీపీ అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దుప్పట్లు, నిత్యావసర సరకులను పోలీసు అధికా రులు అందజేశారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
జాడి పుష్ప , జాడి వెంకటి లు మావోయిస్టు దంపతులు 1999 లో అజ్ఞాతంలోకి వెళ్లడం జరిగింది.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ వనం వీడి జనంలోకి వచ్చేలా చూడాలని ,లొంగిపోతే ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేస్తామని మావోయిస్టు పుష్ప తల్లి మల్లమ్మ, అన్న ఆవుల గంగారాం లను కోరడమైనది. ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో వుంది మావోయిస్టు పార్టీలో పని చేసి సాధించింది శూన్యమని. ఇకనైనా పుష్ప గారు అజ్ఞాతం వీడి జనంలోకి రావాలని, ప్రస్తుత రోజుల్లో మావోయిస్టులకు ప్రజాదరణ తగ్గిందని ఇవే కాకుండా అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారని. ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో హత మయ్యారని. అదేవిధంగా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే వారిపై ఉన్న రివార్డ్ పాటు
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజ నాలు అందేలా కృషిచేస్తామని సీపీ గారు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపిఎస్., బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ ఆఫజలొద్దీన్, తాళ్ళగురిజాల ఎస్ఐ రమేష్,, తదితర. పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
