"మున్సిపల్ రూల్స్ ‘అవుట్’.. మామూళ్ల లెక్కలే ‘ఇన్’: బి.ఎన్.రెడ్డి నగర్ లో టౌన్ ప్లానింగ్ బాగోతం!"
- హయత్ నగర్ సర్కిల్ ‘టౌన్ ప్లానింగ్’ .. బి.ఎన్.రెడ్డి నగర్ లో నిబంధనలు గాలికి!
- కోట్లు ఎగవేస్తున్న అక్రమ నిర్మాణదారులు.. లోపాయికారీ ఒప్పందాలతో అధికారుల అండదండలు
- కలెక్టర్ ఆర్డర్లు ఉన్నా పట్టించుకోని వైనం.. సెట్ బ్యాక్ లు లేవు, ఫైర్ సేఫ్టీ అసలే లేదు!
ఎల్బీనగర్:
ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులే.. అక్రమార్కులకు కొమ్ముకాస్తుంటే, ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయల ఆదాయం అధికారుల జేబుల్లోకి మళ్లుతోంది. జిహెచ్ఎంసి హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ ఇప్పుడు అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. జీవో 118 ప్రకారం భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా, కలెక్టర్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఉన్నా.. స్థానిక నిర్మాణదారులు అనుమతులు తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు. వీరికి టౌన్ ప్లానింగ్ అధికారుల ఆశీస్సులు మెండుగా ఉండటంతో ఇష్టారాజ్యంగా భవనాలు వెలుస్తున్నాయి. ఒకవేళ అనుమతులు తీసుకున్నా.. గృహ నిర్మాణ అనుమతులు తీసుకొని భారీ కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు..
అక్రమాల పుట్ట.. ఈ మూడు నిర్మాణాలు!
1.ముత్తూట్ గోల్డ్ లోన్ ఎదురుగా (నెం. 6-3-980/B పక్కన): ఎన్జీవోస్ కాలనీ నుంచి బి.ఎన్.రెడ్డి వెళ్లే ప్రధాన రహదారిపై అపోలో ఫార్మసీ సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణం యథేచ్ఛగా సాగుతోంది. అధికారుల కళ్లముందే ఇది జరుగుతున్నా 'మామూళ్ల' మత్తులో వారు జోగుతున్నారు.
3.సాగర్ హైవే పీపుల్ సంజీవని హాస్పిటల్ పక్కన (ప్లాట్ నం. 167): ఇది అక్రమాల్లో పరాకాష్ట. ఇక్కడ కేవలం G+2 రెసిడెన్షియల్ అనుమతి తీసుకుని, దానికి విరుద్ధంగా లోతైన సెల్లార్ తోడి 5 అంతస్తుల భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. కనీస సెట్ బ్యాక్ లు లేవు, ఫుట్ పాత్ ను ఆక్రమించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే వందలాది మంది ప్రాణాలకు బాధ్యత ఎవరిది?
అవినీతి ‘విజయ’ విహారం..
వ్రాతపూర్వక ఫిర్యాదులు చేసినా...వంశీకృష్ణ ‘మౌనం’!
హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసిపి విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణలకు స్థానిక ప్రజలు వందల సంఖ్యలో రాతపూర్వక ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. అక్రమ నిర్మాణదారులతో అధికారులు లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని, క్షేత్రస్థాయి పరిశీలనను విస్మరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని అక్రమార్కులతో కలిసి అధికారులు స్వాహా చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కమిషనర్ గారూ.. దృష్టి సారించండి!
ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ఈ అక్రమ వసూళ్ల పర్వంపై మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తక్షణమే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు, అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..jpeg)
