డ్వాక్రా మహిళల జాతీయ విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో పరీక్షలు.

జవహర్ నగర్ సిఓ రాగిరోళ్ళ లక్ష్మీదేవి

డ్వాక్రా మహిళల జాతీయ విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో పరీక్షలు.

జవహర్ నగర్:

మహిళా సంఘాల్లో ఉన్న నిరక్షరాస్యులు అయిన వయోజన మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఉల్లాస్ (అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆన్ ఇన్ సొసైటీ) పథకాన్ని అమలులోకి తెచ్చిందని జవహర్ నగర్ సి ఓ రాగిరోల్ల లక్ష్మీదేవి తెలిపారు. జాతీయ సార్వత్రిక విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలకు రాత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డ్వాక్రా సంఘ సి ఓ లక్ష్మీదేవి హాజరై మాట్లాడుతూ, దేశంలో ఉన్న ప్రతి మహిళ అక్షరజ్ఞానం కలిగి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ పథకాన్ని విద్యాశాఖ సెర్ఫ్ ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారన్నారు. దశలవారీగా అమలు చేసే ఉల్లాస్ పథకంలో ముందుగా మహిళా సంఘాల్లో నిరక్షరాస్యలను గుర్తించి అక్షరాస్యులుగా చేయడంతో పాటు రెండో దశలో మధ్యలో బడి మానివేసిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా పదవ తరగతితో పాటు వారికి ఆసక్తిని బట్టి ఆసక్తి ఉంటే ఓపెన్ ఇంటర్ డిగ్రీ చదివిస్తారు. ఆ తర్వాత వారికి స్కిల్ డెవలప్మెంట్ టెక్నికల్ కోర్సులు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రత్యేక కార్యక్రమమే ఈ ఉల్లాస్ పథకం. ఈ పథకాన్ని విద్యాశాఖ సేర్ఫ్ ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఉల్లాస్ పథకంలో ముందుగా మహిళా సంఘాల్లో నిరక్షరాస్యలను గుర్తించి అక్షరాసులుగా చేయడంతో పాటు రెండో దశలో మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా పదవ తరగతితో పాటు వారి ఆసక్తిని బట్టి వివిధ కోర్సుల్లోకి పంపిస్తారని తెలిపారు. అనంతరం 60 మంది డ్వాక్రా సంఘ మహిళలకు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఎల్ఎఫ్ శోభా రెడ్డి, ఆర్పీలు పాములపర్తి సుజాత, కే పద్మ, లీలావతి, వడ్లకొండ రాజేశ్వరి, మంజుల, కళావతి, డ్వాక్రా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About The Author