పటాన్‌చెరు లో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఘన సన్మాన సభ

మంత్రుల సమక్షంలో మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

పటాన్‌చెరు లో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఘన సన్మాన సభ

పటాన్‌చెరు :

పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా ఏర్పాటైన సందర్భంగా, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు మార్కెట్ ప్రాంగణంలో ఘనంగా సన్మాన సభ నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ, తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి , TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి , ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ , మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, పాల్గొని మార్కెట్ కమిటీ నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వారిని ఘనంగా సన్మానించారు.

నూతనంగా ఏర్పాటైన మార్కెట్ కమిటీకి శివానందం చైర్మన్‌గా, రాజశేఖర్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యులుగా బిక్షపతి, మైపాల్, నాగరాజు, నర్సింలు, బాలరాజ్, ఈశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, సతీష్ కుమార్ గౌడ్, ఇమ్రాన్, సునీత, హమీద్, సామయ్య, మల్లయ్య, గోపాల్ రెడ్డి ఉన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.WhatsApp Image 2026-04-12 at 19.49.15WhatsApp Image 2026-04-12 at 19.49.14 (1)

About The Author