నిబంధనలు తుంగలో తొక్కి.. అక్రమ నిర్మాణాలతో నిలువునా ముంచేస్తూ..!
- * చట్టం చచ్చిందా.. అధికారులు అమ్ముడుపోయారా? మార్వాడీల అక్రమ దందాపై నిలదీత!
- * రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ దందా.. మున్సిపల్ ఖజానాకు భారీ గండి!
- * ఎన్జీఓస్ కాలనీలో వంద శాతం నిబంధనల ఉల్లంఘన..
- * మూడు నెలలైనా కదలని టౌన్ ప్లానింగ్ యంత్రాంగం!
- * హయాత్‌నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారిని విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ వినయ్ కృష్ణ ల పాత్రపై అనుమానాలు!
- * ఈ అక్రమాలకు బిల్డ్ నౌ వెబ్సైట్ పారదర్శకత లేకపోవడం ప్రధాన కారణం.
- * విజిలెన్స్ ఏసీబీ నిఘా విభాగాలు ఏం చేస్తున్నాయి..?
- * మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ సెక్రెటరీ జయష్ రంజన్, దృష్టి సారించాలి..
ఎల్బీనగర్:
"భగవాన్ సే బడా దౌలత్" అనే నినాదంతో, డబ్బు కోసం దేవుణ్ణి, ధర్మాన్ని పక్కనపెట్టి మార్వాడీలు చేస్తున్న అక్రమాలు దేశాన్ని పీడిస్తున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో వందకు పైగా అక్రమ నిర్మాణాలు దీనికి నిదర్శనం. తెలంగాణ మున్సిపల్ నిబంధనలను తుంగలో తొక్కి, రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మిస్తూ, ఫుట్ పాత్‌లను ఆక్రమిస్తూ, ఫైర్ సేఫ్టీ లేని అక్రమ కట్టడాలతో మున్సిపల్ ఖజానాకు కోట్ల గండి కొడుతున్నారు.
హయత్ నగర్ సర్కిల్‌లో వంద శాతం డివియేషన్, అక్రమ సెల్లార్లతో సాగుతున్న ఓ నిర్మాణంపై ఆధారాలతో సహా టౌన్ ప్లానింగ్ అధికారిణి విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ వినయ్ కృష్ణలకు మూడు నెలల క్రితమే సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేసినా పైసా పరమాత్మగా మారిన అధికారులు కదలడం లేదు. ప్రజా ప్రతినిధుల నుండి ఉన్నతాధికారుల వరకు అందరినీ కొనేస్తామనే మార్వాడీల అవినీతి నైజానికి, అధికారుల చేతకానితనానికి వ్యతిరేకంగా ప్రజాపోరాటం అనివార్యం.

* అనుమతులు ఒకదానికి.. నిర్మాణం మరొకదానికి!
ఎల్బీనగర్ నియోజకవర్గంలో దాదాపు వందకు పైగా ఇలాంటి అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయంటే ఇక్కడి అధికారుల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పన్నులు ఎగవేస్తూ, నివాస గృహాల (రెసిడెన్షియల్) అనుమతులు తీసుకొని వాణిజ్య (కమర్షియల్) నిర్మాణాలు చేపడుతూ లక్షలాది రూపాయల మున్సిపల్ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. ఎన్జీఓస్ కాలనీ నుండి రెడ్ ట్యాంక్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన, 'బాలయ్య బాబు బిర్యానీ' మరియు 'విజయ్ కార్ వాషింగ్ సెంటర్' సమీపంలోని ప్లాట్ నెం. MIG C-759 లో సాగుతున్న నిర్మాణమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
* మట్టి స్థిరీకరణ శూన్యం.. రహదారికి ముప్పు!
ఇక్కడ బిల్డర్లు నిబంధనల ప్రకారం చేపట్టాల్సిన మట్టి స్థిరీకరణ (సాయిల్ స్టెబిలైజేషన్) నియమాలను పూర్తిగా విస్మరించారు. ఎలాంటి రక్షణ గోడలు లేకుండానే భారీగా సెల్లార్ తవ్వకాలు జరపడంతో, పక్కనే ఉన్న ప్రధాన రహదారి ఎప్పుడు కుంగిపోతుందోనన్న భయం వ్యక్తమవుతోంది. వర్షాలు పడితే ఈ సెల్లార్ చుట్టుపక్కల ఉన్న భవనాల స్థిరత్వానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. కనీస అగ్నిమాపక రక్షణ చర్యలు గానీ, ప్రమాదాలు జరగకుండా అడ్డుకునే భద్రతా ఫెన్సింగ్‌లు గానీ ఏర్పాటు చేయలేదు. ఇది నిత్యం రాకపోకలు సాగించే వందలాది మంది ప్రయాణీకులకు అత్యంత ప్రమాదకరంగా మారింది.
ఈ నిర్మాణంలో తెలంగాణ మున్సిపల్ (TS-bPASS) నిబంధనలను నిలువునా ఉల్లంఘించారు. కనీస ఖాళీ స్థలం (సెట్‌బ్యాక్) వదలకుండా, పార్కింగ్ కోసం ఎలాంటి స్థలాన్ని కేటాయించకుండానే పిల్లర్లు లేపుతున్నారు. అంతటితో ఆగకుండా, ప్రజలు నడవడానికి ఉద్దేశించిన ప్రభుత్వ ఫుట్‌పాత్‌ను సైతం అక్రమంగా ఆక్రమించి వంద శాతం నిబంధనల ఉల్లంఘనకు (డివియేషన్) పాల్పడ్డారు. దీనివల్ల కాలినడకన వెళ్లే పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రధాన రహదారిపై నుంచే నడవాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఈ భవనం వల్ల ఈ బిజీ రోడ్డుపై భారీగా రద్దీ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.
*మూడు నెలల క్రితమే ఫిర్యాదు చేసినా కదలని అధికారులు!
ఈ ఘోర ఉల్లంఘనలపై సామాజిక కార్యకర్తలు అన్ని రకాల ఆధారాలతో భవన నిర్మాణం ప్రాథమిక దశలో ఉన్నప్పుడే, అంటే మూడు నెలల క్రితమే హయాత్‌నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారిని విజయలక్ష్మికి, డిప్యూటీ కమిషనర్ వినయ్ కృష్ణకు, అలాగే జోనల్ కమిషనర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదులు సమర్పించారు. అయినా సరే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
అక్రమ నిర్మాణదారులకు, టౌన్ ప్లానింగ్ అధికారులకు మధ్య ఉన్న అపవిత్ర బంధాన్ని ఈ నిర్లక్ష్యం స్పష్టం చేస్తోంది. ఉన్నతాధికారులను కొనేస్తామనే ధీమాతోనే బిల్డర్లు యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. సామాజిక కార్యకర్తలు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా వినే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మరియు హైడ్రా (HYDRAA) స్పందించి, తక్షణమే అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయడంతో పాటు, అక్రమాలకు సహకరించిన టౌన్ ప్లానింగ్ అధికారిని విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ వినయ్ కృష్ణలపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

