మొక్కు తీర్చుకున్న వెంకట్రావుపేట సర్పంచ్ బండారు కవిత

కాలి నడకన 3550 మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించిన సర్పంచ్ కుటుంబం

మొక్కు తీర్చుకున్న వెంకట్రావుపేట సర్పంచ్ బండారు కవిత

సిద్దిపేట:

సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన సందర్భంగా చేసిన మొక్కును వెంకట్రావుపేట సర్పంచ్ బండారు కవిత భక్తిశ్రద్ధలతో తీర్చుకున్నారు. భర్త స్వామి గౌడ్, కుమార్తెలు జ్యోష్ణ, స్నేహలతో కలిసి తిరుమల శ్రీవారిని కాలి నడకన దర్శించుకున్నారు. భక్తి నామస్మరణల మధ్య ఒక్కో మెట్టుకు భక్తి బొట్టు పెట్టుకుంటూ మొత్తం 3550 మెట్లు ఎక్కి ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సర్పంచ్‌గా గెలిస్తే మెట్ల మార్గంలో తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటానని గతంలో చేసిన సంకల్పాన్ని ఈ సందర్భంగా నెరవేర్చుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగేందుకు ఆశీస్సులు ప్రసాదించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించిన్నట్లు తెలిపారు.

About The Author