ప్రజావాణిలో వచ్చినా సమస్యలు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి

- అదనపు కలెక్టర్ అశోక్ కుమార్

WhatsApp Image 2025-10-27 at 7.25.15 PM

భూపాలపల్లి : 

Read More నేటి భారతం..

ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి   వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదుల దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి మొత్తం 36 దరఖాస్తులు స్వీకరించామని, వాటిని సంబంధిత శాఖాధికారులకు తక్షణ పరిష్కారానికి ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులు ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును  ప్రాధాన్యతగా  తీసుకోవాలని, తీసుకున్న చర్యలపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, అన్ని  శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More హుజుర్నగర్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతా

About The Author