ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మండల అధ్యక్షుడు బుస్స సురేష్ అధ్యక్షతన గజ్యానాయక్ తండాలో ఎన్నికల సన్నాహక సమావేశం
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 11: పట్టభద్రులు, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాలో మండల ఎమ్మెల్సి ఎన్నికల సన్నాహక సమావేశం మండల అధ్యక్షుడు బుస్స సురేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ, మండలంలోని ప్రతి కార్యకర్త బీజేపీ బలపరిచిన పట్టభద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి, ఉపాద్యాయ అభ్యర్థి మల్క కొమురయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా మండలంలోని ప్రతి ఓటరును అభ్యర్థించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక విధానాలు , గత ఎన్నికల సమయంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన మాట తప్పడం, నిరుద్యోగ భృతి ఇవ్వక పోవడం వంటి అంశాలు ఓటర్లకు వివరించి బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరాలని అన్నారు.
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 11: పట్టభద్రులు, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాలో మండల ఎమ్మెల్సి ఎన్నికల సన్నాహక సమావేశం మండల అధ్యక్షుడు బుస్స సురేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ, మండలంలోని ప్రతి కార్యకర్త బీజేపీ బలపరిచిన పట్టభద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి, ఉపాద్యాయ అభ్యర్థి మల్క కొమురయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా మండలంలోని ప్రతి ఓటరును అభ్యర్థించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక విధానాలు , గత ఎన్నికల సమయంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన మాట తప్పడం, నిరుద్యోగ భృతి ఇవ్వక పోవడం వంటి అంశాలు ఓటర్లకు వివరించి బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరాలని అన్నారు.
